IND Vs BAN: టీమిండియాతో తలపడే బంగ్లాదేశ్ జట్టు ఇదే.. జట్టులో మార్పులు చేయొచ్చు..!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్, ఇండియా తలపడనున్నాయి. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుపై కూడా గెలవాలని ఆత్రుతగా ఉంది. మొదటి మ్యాచులో ఆఫ్ఘానిస్తాన్‌ను ఓడించినా, ఆపై రెండు మ్యాచులోనూ బంగ్లా చిత్తుగా ఓడింది. తాజా ఫామ్, బలాబలాలను బట్టి ఇండియాకు ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయం అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 2007 ప్రపంచ కప్‌లో అనూహ్యంగా బంగ్లా చేతిలో భారత్ ఓడింది. ఆపై మూడు వరల్డ్ కప్‌లలో కూడా బంగ్లాను టీమిండియా చిత్తుగా ఓడించింది.
అద్భుత ఫామ్ లో లిట్టన్ దాస్
ఓపెనర్లుగా తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ బంగ్లాదేశ్‌కు తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. 2020లో అండర్-19 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన తాంజిద్ హసన్, తమీమ్ ఇక్బాల్ టోర్నమెంట్ నుండి తప్పుకోవడంతో ప్రపంచ కప్ జట్టులోకి అడుగుపెట్టాడు. తాంజిద్ హసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాలని బంగ్లా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లిట్టన్ దాస్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచులో ఇంగ్లండ్‌పై 66 బంతుల్లో 76 పరుగులు చేసి సత్తా చాటాడు. మిడిలార్డర్‌లో ముష్ఫికర్ రహీమ్‌తో బంగ్లా పటిష్టంగా ఉంది. రహీమ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లోనూ వరుసగా అర్ధ సెంచరీలు చేసి రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 119 పరుగులు చేశాడు.
మహ్మదుల్లా స్థానంలో మహేదీ హసన్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నజ్ముల్ హొస్సేన్ శాంటో 83 బంతుల్లో 59 చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై భారీ స్కోర్లు సాధించనప్పటికీ టీమిండియా స్పిన్నర్లపై ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఆల్ రౌండర్లగా షకీబ్అల్ హసన్, హసన్ మిరాజ్, మహేదీ హసన్ వన్డేల్లో షకీబ్ అల్ హసన్‌కు మెరుగైన రికార్డు ఉంది. బ్యాట్, బాల్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. అతను ఇప్పటివరకు 79 పరుగులు చేసి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మహ్మదుల్లా స్థానంలో మహేదీ హసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే
బౌలర్లగా తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానంగా తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్ ఆధారపడి ఉంది. షోరిఫుల్ ఇస్లాం మాత్రం మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టి అందరికంటే ముందు ఉన్నాడు. భారత్‌పై ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్నారు. ముస్తాఫిజుర్ 11 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ ఏడు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ జట్టు తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (సి), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్ (WK), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్