IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?
ఈ వార్తాకథనం ఏంటి
ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ (IPL) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.
నేడు మినీ ఐపీఎల్ వేలం జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఆక్షన్‌ను విదేశాల్లో నిర్వహిస్తున్నారు.
దుబాయ్‌లోని కోకాకోలా అరీనా దీనికి వేదిక కానుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు.
ఇందులో 214 మంది భారత క్రికెటర్లు, 119 మంది విదేశీయుల్లో ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లున్నారు.
మొత్తం 10 జట్లు కలిపి గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఈ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
Details
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పై ఎక్కువ ఆసక్తి
ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్(రూ.2 కోట్లు) పైనా ప్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇక వన్డే వరల్డ్ కప్‌లో భారత్ పిచ్‌లపై చెలరేగిన దక్షిణాఫ్రికా పేసర్ కొయెట్జీ (రూ.2 కోట్లు)కి డిమాండ్ ఎక్కువగా ఉంది.
శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ హసరంగ (రూ.1.50 కోట్లు), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, క్రిస్ వోక్స్, ఫెర్గూసన్, హేజిల్‌వుడ్ (రూ.2 కోట్లు)లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాయి.
హోల్డర్, నీషమ్ (రూ.1.50 కోట్లు), రోమన్ పావెల్, డరైల్ మిచెల్, బ్రేస్‌వెల్ (రూ.కోటి), మదుశంక, షంసి, కేశవ్ మహరాజ్ (రూ.50 లక్షలు) కోసం జట్లు పోటి పడే అవకాశముంది.
Details
అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.38.14 కోట్లు
భారత్ ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్(రూ.2 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.2 కోట్లు), షారుక్ ఖాన్ (రూ.40 లక్షలు) సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ (రూ.2 కోట్లు), కేఎస్ భరత్, మనీశ్ పాండే, సిద్దార్థ్ కౌల్ పై కాసుల వర్షం కురవనుంది.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ లీగ్ వేలాన్ని తొలిసారిగా ఓ మహిళ నిర్వహించనున్నారు.
అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.38.14 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.5 కోట్లు ఉన్నాయి.