Unmukt Chand: T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కి వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యం: ఉన్ముక్త్ చంద్
2012 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్,రాబోయే ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు. సెప్టెంబరు 2021లో భారతదేశంలోని అన్ని రకాల క్రికెట్‌ల నుండి రిటైర్ అయ్యిన ఉన్ముక్త్ .. అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్‌తో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకొన్నాడు. అతను USAలో సంవత్సరానికి 10 నెలలు మూడేళ్లపాటు ఉండవలసి ఉంటుంది. ప్రముఖ వెబ్సైటు క్రిక్‌బజ్‌కు ఉన్ముక్త్ చంద్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ సందర్భంగా మాట్లాడుతూ టీమిండియాకు వ్యతిరేకంగా ఆడడం చాలా వింతగా అనుభవమని అన్నాడు.
మూడు సీజన్లలో 1500 కంటే ఎక్కువ పరుగులు
తానూ భారత్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి..భారత జట్టుకు వ్యతిరేకంగా ఆడాలనేదే తన లక్ష్యమని అన్నాడు.ఇలా చెప్పడంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై నన్ను నేను పరీక్షించుకోవడమే లక్ష్యమని ఉన్ముక్త్ చంద్ చెప్పాడు. ఉన్ముక్త్ చంద్ U-19 వరల్డ్ కప్ 2012 ఫైనల్‌లో సెంచరీ చేసి, మ్యాచ్ ను గెలిపించినప్పటికీ అతను అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. 2021లో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉన్ముక్త్ చంద్, ఆపై USAకి వెళ్లాడు. అక్కడ అతను సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్‌కు నాయకత్వం వహించి మొదటి మైనర్ లీగ్ క్రికెట్ T20 టైటిల్‌ను గెలిపించడంలో సఫలమయ్యారు . మూడు సీజన్లలో 1500 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.