LOADING...
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు
వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 27, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టాప్ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ ఆటగాడి ప్రదర్శనపై పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

ఏఐ చిప్ వాడుతున్నాడంటూ ఆరోపణలు

'స్మాష్ హిట్' కార్యక్రమంలో మాట్లాడిన నౌమాన్ నియాజ్, వైభవ్ బ్యాట్‌ను పరిశీలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడా (WADA) ఎలా డోప్ పరీక్షలు చేస్తుందో, అదే తరహాలో ఇతని బ్యాట్‌ను ల్యాబ్‌కు పంపాలని అన్నారు. అతని మాటల్లో, "ఆ పిల్లాడు తన బ్యాట్‌లో ఏఐ (AI) చిప్ ఉపయోగిస్తున్నాడేమో అని అనుమానం ఉంది. 18 ఏళ్లు దాటితేనే శరీర బలం పెరుగుతుంది కానీ 16 ఏళ్ల లోపు వయసులో ఇంత శక్తి ఎలా వస్తుంది?" అని ప్రశ్నించారు. అలాగే విరాట్ కోహ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు పుట్టిన ఈ కుర్రాడు 360 డిగ్రీల్లో షాట్లు ఆడటం ఆశ్చర్యంగా ఉందని కూడా వ్యాఖ్యానించారు.

వివరాలు

రికార్డులు బద్దలు కొడుతున్న వైభవ్

ఈ ఆరోపణలను పక్కన పెడితే, వైభవ్ మాత్రం మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు చేసి ఫాస్టెస్ట్ సెంచరీకి దగ్గరగా వచ్చాడు. అయితే ఆ రికార్డును స్వల్పంగా మిస్ అయ్యాడు. అయితే ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మాత్రం అతడు పూర్తిగా చెలరేగిపోయాడు. కేవలం 37 బంతుల్లోనే శతకం బాది తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసినప్పటికీ, కీలక సమయంలో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.

Advertisement

వివరాలు

ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్న బుడ్డోడు..

ఐపీఎల్‌లో ప్రస్తుతం వైభవ్ టాప్ బ్యాటర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ ఉన్నాయి. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి ముందుకు సాగుతున్నాడు. టాప్-10 జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ తప్ప మిగతా వారంతా భారతీయులే ఉండటం విశేషం. క్రికెట్ విశ్లేషకుల ప్రకారం, "వైభవ్ ఆట చాలా అద్భుతంగా ఉంది. అతని టెక్నిక్, టైమింగ్, రిస్ట్ వర్క్ ఎంతో మెరుగ్గా ఉన్నాయి. పవర్ మాత్రమే కాకుండా షాట్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది" అని ప్రశంసిస్తున్నారు.

Advertisement

వివరాలు

బీసీసీఐ దృష్టిలో వైభవ్

గత ఏడాది కాలంగా వైభవ్ ప్రదర్శన అత్యంత స్థాయిలో ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కూడా సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టులో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే జూన్ నాటికి అతను భారత సీనియర్ జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బ్రియాన్ లారా వంటి లెజెండరీ ఆటగాళ్లలా అతన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

Advertisement