Loading...
Vaibhav Suryavanshi : 514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

Vaibhav Suryavanshi : 514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో ఓ కొత్త సంచలనం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ధాటైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంటూ, అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లకే సవాల్ విసురుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.

వివరాలు

100 సిక్సర్లు బాదిన బుడ్డోడు..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మరోసారి తన పేలవంతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో రాజస్థాన్ రాయల్స్‌కు దూకుడు అందిస్తూ కేవలం 16 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు.

అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు చోటుచేసుకున్నాయి.

ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలచి తన దూకుడు ప్రారంభించాడు.

అదే సమయంలో టీ20 చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.

ఈ ఘనత సాధించే క్రమంలో పలువురు ప్రముఖ సీనియర్ క్రికెటర్ల రికార్డులను అధిగమించాడు.

వివరాలు

15 ఏళ్ల వయసులోనే రికార్డు..

వైభవ్ ఈ అరుదైన మైలురాయిని కేవలం 15 ఏళ్ల వయసులో అందుకోవడం మరింత విశేషంగా నిలిచింది.

20 ఏళ్ల లోపు వయసులో టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా అతడు గుర్తింపు పొందాడు.

అంతేకాదు, కేవలం 514 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించి అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.

ఇంతకుముందు ఈ రికార్డు 817 బంతుల పేరుతో ఉండగా, వైభవ్ దాన్ని దాదాపు 300 బంతుల ముందే అధిగమించడం అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

అలాగే కేవలం 29 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకుని అగ్రస్థానంలో నిలిచాడు.

ADVERTISEMENT

వివరాలు

ఐపీఎల్‌లో సరికొత్త అధ్యాయం..

ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ కేవలం వ్యక్తిగత రికార్డులతోనే కాకుండా, టోర్నీ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు.

పవర్ ప్లే ఓవర్లలో 30కి పైగా సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇంతకుముందు అభిషేక్ శర్మ పేరిట ఉన్న 29 సిక్సర్ల రికార్డును చెరిపేసి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు.

అతని ధైర్యవంతమైన బ్యాటింగ్, ఒత్తిడిని లెక్కచేయని ఆటతీరు భవిష్యత్తులో భారత క్రికెట్‌కు గొప్ప బలంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

క్రికెట్‌లో కొత్త యుగం..

ఇప్పటికే 20 ఏళ్లలోపు టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ 102 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అతని తర్వాత రహ్మానుల్లా గుర్బాజ్ 90 సిక్సర్లు, డెవాల్డ్ బ్రెవిస్ 73 సిక్సర్లతో ఉన్నారు.

చిన్న వయసులోనే ఇంతటి స్థాయిలో ప్రభావం చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే, ప్రపంచ క్రికెట్‌లో ఓ కొత్త యుగం ఆరంభమైనట్లే కనిపిస్తోంది.

ADVERTISEMENT