LOADING...
#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్
కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్

#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ యువ ఆటగాడు కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. 280 స్ట్రైక్‌రేట్‌తో, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న అతను ఔటయ్యాక పెవిలియన్ వైపు నడుస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరి మనసులను తాకింది.

వివరాలు

బుమ్రాపై దూకుడు… అయినా తృప్తి లేదు!

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన దాడిని మొదలుపెట్టాడు. మొత్తం ఐదు సిక్సర్లతో ముంబై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే ఒక భారీ షాట్ ప్రయత్నంలో ఔటయ్యాక అతని ముఖంలో ఆనందం కనిపించకుండా తీవ్ర నిరాశ వ్యక్తమైంది. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్నప్పుడు కళ్లలో తారాడిన కన్నీళ్లు కెమెరాలో బంధించబడ్డాయి. 14 బంతుల్లో 39 పరుగులు సాధించడం చిన్న వయసులో గొప్ప విషయమే అయినప్పటికీ, జట్టుకు మరింత సహాయం చేయలేకపోయానన్న బాధ అతని క్రీడాస్ఫూర్తిని తెలియజేస్తోంది.

వివరాలు

చిన్న వయసులోనే గొప్ప భావోద్వేగం!

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు వైభవ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "ఇంకా చిన్న వయసులోనే ఉన్నాడు... కానీ అతని ఎమోషన్ అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. బుమ్రా లాంటి అగ్రశ్రేణి బౌలర్‌పై అద్భుతంగా ఆడినప్పటికీ సంతృప్తి చెందకపోవడం అతని అంకితభావాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇలాంటి పరుగుల పట్ల ఆకలి ఉన్న ఆటగాడే భవిష్యత్తులో టీమిండియాకు స్టార్ అవుతాడని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వివరాలు

వైభవ్ భావోద్వేగ స్పందన

మరోవైపు, ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయానంతరం వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో స్పందించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో తన ప్రతిభను చాటుకుంటున్న ఈ బీహార్ యువకుడు అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకుంటూ, "సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు" అని సంక్షిప్తంగా తన భావాలను వ్యక్తం చేశాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో: 

Advertisement