Page Loader
Virat Kohil: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

Virat Kohil: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohil) మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచులో ఆ ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2019-2025లో టీమిండియా తరుఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మను అధిగమించి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 57 ఇన్నింగ్స్‌లలో 2101 పరుగులు చేయగా, రోహిత్ శర్మ(Rohit Sharma) 42 ఇన్నింగ్స్‌లో 2,097 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత 1,769 పరుగులతో ఛతేశ్వర్ పుజారా మూడో స్థానంలో నిలిచాడు.

Details

శతకంతో చెలరేగిన కేఎల్ రాహుల్

ధక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసి విరాట్ కోహ్లీ ఔటైన విషయం తెలిసిందే. మ్యాచ్ విషయానికొస్తే.. మొదటి టెస్టుల్లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులు చేసి ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ (5), గిల్ (2), కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో కేఎల్ రాహుల్ క్రీజులో నిలిచి (101) శతకంతో చెలరేగాడు.