Page Loader
Virat Kohli: భారత జట్టు నూతన టెస్ట్‌ కెప్టెన్‌,వైస్‌ కెప్టెన్‌ను లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించిన కోహ్లీ!
భారత జట్టు నూతన టెస్ట్‌ కెప్టెన్‌,వైస్‌ కెప్టెన్‌ను లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించిన కోహ్లీ!

Virat Kohli: భారత జట్టు నూతన టెస్ట్‌ కెప్టెన్‌,వైస్‌ కెప్టెన్‌ను లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించిన కోహ్లీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలే విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఆడబోతోంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలో జరగనుంది. ఈ సందర్భంగా, భారత జట్టులో నూతన టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడైన శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో సహా మరికొంతమందిని విరాట్ కోహ్లీ లండన్‌లోని తన నివాసానికి ఇటీవల ఆహ్వానించినట్లు సమాచారం. అక్కడ వారు కొన్ని గంటల పాటు కోహ్లీ ఆతిథ్యం అందుకున్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

శుభమన్ గిల్‌కు ఇది కెప్టెన్‌గా తొలి టెస్ట్ 

శుభమన్ గిల్‌కు ఇది కెప్టెన్‌గా తొలి టెస్ట్ సిరీస్‌ కావడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ మధ్యలో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం, బీసీసీఐ సెలక్షన్ కమిటీ గిల్‌ను భారత టెస్ట్ జట్టు నాయకుడిగా ఎంపిక చేసింది. ఇక ఈ ఇంగ్లండ్ సిరీస్‌తోనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్ (WTC) తాజా సైకిల్‌ ప్రారంభమవుతుంది. గత సీజన్‌లో ఫైనల్‌కు చేరతామనే అంచనాల మధ్య భారత్ జట్టు నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ సారి కొత్త సైకిల్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా మైదానంలోకి దిగనుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఈ సిరీస్‌లో భారత జట్టు విజయాన్ని ఆశిస్తున్నారు.