
Virat Kohli - IPL: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీదే.. ఈ రికార్డు బద్దలవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ అంటే భారీ సిక్సర్లు,అద్భుతమైన క్యాచ్‌లు,అదిరిపోయే వికెట్లు మాత్రమే కాదు.. అంతకు మించి ఎవరూ అందలేని రికార్డులు కూడా.
17 సీజన్ల ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి.
వాటిలో కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు తాకలేని,భవిష్యత్తులో సమీపించలేని రికార్డుల జాబితా మీ కోసం.
ఐపీఎల్ రికార్డులు చెప్పినప్పుడు ముందుగా గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ (Virat Kohli).
అందుకే ఈ సిరీస్‌ను ఆయనతో ప్రారంభిస్తున్నాం. ఐపీఎల్‌లో పరుగుల విభాగంలో విరాట్ కోహ్లీ ఇప్పట్లో అందనంత ఎత్తులో నిలిచాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున 252 మ్యాచ్‌లు ఆడి 8,004 పరుగులు చేశాడు. ఈ రికార్డును అధిగమించే ప్లేయర్ ప్రస్తుతం దరిదాపుల్లో కూడా లేడు.
వివరాలు
సమీప భవిష్యత్తులో ఎవ్వరూ లేరు..
టాప్-10 జాబితాలో రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్ (6769 పరుగులు) ఐపీఎల్‌కు దాదాపుగా దూరమయ్యాడు, కాబట్టి అతని పేరును పరిగణించలేం.
మరో అవకాశమున్న ఆటగాడు రోహిత్ శర్మ (6628 పరుగులు). అయితే హిట్ మ్యాన్ విరాట్ రికార్డును బద్దలు కొట్టాలంటే వరుసగా భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది.
వయసును దృష్టిలో ఉంచుకుంటే, అతడు మరికొన్ని సీజన్లు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రికార్డును సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అధిగమించే సూచనలు కనిపించడం లేదు.