Virat Kohli: యోయో టెస్టులో సత్తా చాటిన విరాట్ కోహ్లీ.. ఎన్ని పాయింట్లు సాధించాడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెటర్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యోయో టెస్టు పరీక్షలు నిర్వహించారు. ఇందులో భారత స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫిటెనెస్‌ను నిరూపించుకున్నాడు.
ఆసియా కప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు అందరికీ ప్రిపరేటరీ క్యాంప్ ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ ఏకంగా 17.2 పాయింట్లు సాధించాడు.
యో యో టెస్టు పాసవడం ఆనందగా ఉందంటూ విరాట్ కోహ్లీ ఇన్ స్టా స్టోరీలో వెల్లడించారు.
ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా ఇప్పటికే భారత జట్టు సభ్యులు బెంగళూరులోని ఎన్సీఏకు చేరుకున్నారు.
Details
సెప్టెంబర్ 2న భారత్-పాక్ మధ్య మ్యాచ్
గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. భారత తరుపున టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆసియా కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
ఎన్సీఏలో ప్రిపరేటరీ క్యాంప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు అందరూ ఆసియా కప్ కోసం శ్రీలంక కు బయలు దేరుతారు.
సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనుంది. కోహ్లీతోపాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బెంగళూరు క్యాంపులో ఉన్నాడు.
అయితే హిట్ మ్యాన్ యో యో టెస్టు ఎలా ముగిసిందని కొందరు కామెంట్లు చేస్తుండడం గమనార్హం.