ENG Vs PAK: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా చేస్తే సరిపొద్ది.. పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ సలహా
వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడాతో గెలుపొందడంతో నాలుగో సెమీస్ బెర్తు ఖరారైంది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు సెమీస్‌కు చేరాయి. పాకిస్థాన్ జట్టు సెమీస్ కు చేరాలంటే ఇంగ్లండ్‌పై పాక్ 287 పరుగుల తేడాతో గెలుపొందాలి. ఈ మ్యాచులో 300 పరుగులు సాధిస్తే ఇంగ్లండ్ ను 13 పరుగులకే పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్ కు ఈ టాస్క్ అసాధ్యమని చెప్పొచ్చు. ఇక పాక్ సెమీస్ చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు.
ప్లేయర్లను గదిలో ఉంచి గొళ్లెం పెట్టాలి : పాక్
ఇంగ్లండ్ పై తమ జట్టు 400కు పైగా స్కోరు చేయడం లేదా 287 పరుగుల తేడాతో గెలవడం వంటివి జరగవని వసీం అక్రమ్ చెప్పారు. పాక్ తొలుత బ్యాటింగ్ చేయాలని, ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూంలో పెట్టి గొళ్లెం పెట్టాలన్నారు. ఆ తర్వాత వారిని 20 నిమిషాల్లో టైమ్డ్ ఔట్ చేసి మెరుగైన నెట్ రన్‌రేట్ వస్తుందని, దీంతో పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుతుందన్నారు.ఇదిలా ఉండగా.. రేపు ఇంగ్లండ్ జట్టుతో పాకిస్థాన్ తలపడనుంది.