LOADING...
R Ashwin: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో అశ్విన్ పాల్గొంటాడా? 
ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో అశ్విన్ పాల్గొంటాడా?

R Ashwin: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో అశ్విన్ పాల్గొంటాడా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత, భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన తదుపరి కెరీర్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. భారత్‌ క్రికెట్‌ నుంచి దూరమవ్వడంతో,ప్రపంచంలోని వివిధ ప్రఖ్యాత లీగ్‌లలో ఆడే అవకాశాలను పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో,ఆ లీగ్‌లలో తనకు నచ్చిన ఫ్రాంచైజీలతో సమావేశాలు,చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్‌ ఇప్పటివరకు ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌,సౌతాఫ్రికా టీ20 లీగ్‌,ద హండ్రెడ్‌ లీగ్‌,మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ వంటి వేర్వేరు లీగ్‌లలో కొన్ని ఫ్రాంచైజీలతో ఒప్పందాలు సాధించినట్లు సమాచారం. తాజాగా,ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా ఓ ప్రముఖ ఫ్రాంచైజీతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఏ లీగ్‌లో అయినా ఒప్పందం కుదిరినా,అశ్విన్‌ ప్లేయర్‌గా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే.. 

ఈవిధంగా చేస్తే,అతనికి కోచింగ్ అనుభవం కూడా పొందగలుగుతాడు అని అశ్విన్‌ భావిస్తున్నాడు. శారీరకంగా ఆడకలిగే స్థితిలో లేకపోయే రోజులలో ఆటగాడిగా మారిపోయే భయం లేకుండా కోచ్‌గా కొనసాగవచ్చని అతని ఆలోచన. క్రికెట్‌ లో అత్యున్నత జీనియస్‌గా పేరున్న అశ్విన్‌ ఇప్పటికే తన యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. ఆఛానల్‌లో ప్రపంచ క్రికెట్‌పై తన విశ్లేషణలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు.37ఏళ్ల అశ్విన్‌ ఆగస్ట్‌ 27న ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయక్రికెట్‌కి వీడ్కోలు చెప్పి,భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా విరమించాడు. బీసీసీఐ నియమాల ప్రకారం,భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో ఆడాలంటే,అంతర్జాతీయ క్రికెట్‌కి అలాగే ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆడేందుకు యాష్‌ కొంచెం ముందుగానే ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడని వినికిడి .