Page Loader
RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!
హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!

RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇవాళ తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌లు బయటి మైదానాల్లో ఆడిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ మాత్రం తన హోం గ్రౌండ్‌ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. వరుస విజయాలతో హోరాహోరీగా దూసుకెళ్తున్న ఆర్సీబీ, గుజరాత్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని భావిస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఐపీఎల్ 2025 14వ మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ-గుజరాత్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌ను జియో సినిమాస్, హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.

Details

హెడ్ టు హెడ్ రికార్డ్స్ 

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటి వరకు కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. అందులో ఆర్సీబీ మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది, గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వీరి మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు రికార్డు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 91 మ్యాచ్‌లు ఆడింది. అందులో 43 విజయాలు సాధించగా, 43 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, మరో నాలుగు మ్యాచ్‌లకు ఫలితం తేలలేదు.

Details

 ఆర్సీబీ vs గుజరాత్ మోస్ట్ రన్స్ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 344 పరుగులు, ఫాఫ్ డుప్లెసిస్ 160 పరుగులు, శుభమన్ గిల్ 154 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో ఒకప్పటి ఆర్సీబీ బౌలర్, ప్రస్తుత గుజరాత్ పేసర్ అయిన మహ్మద్ సిరాజ్ మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, నూర్ అహ్మద్ 4 వికెట్లు, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.