Tilak Varma : వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మకు చోటు లభిస్తుందా.. మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఇదే!
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున సత్తా చాటిన తిలక్ వర్మ, పొట్టి ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. అరంగ్రేటం మ్యాచ్ నుండి చాలా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌లు ఆడుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎడమ చేతివాటం కలిగిన తిలక్ దూకుడుగా ఆడటంలో రాటుదేలుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియా వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో యువకులకు చోటు కల్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ తరుణంలో తిలక్ వర్మ ఎంపికపై ప్రస్తుతం ఆసక్తి పెరిగింది. ప్రపంచ కప్ స్క్యాడ్‌లోకి వచ్చే అవకాశాలు తిలక్ వర్మకు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ అయ్యర్ వరల్డ్ నుంచి వైదొలిగితే ఆ స్థానం కోసం తిలక్ వర్మను పరిగణనలోకి తీసుకొనేందుకు అవకాశం ఉందని ప్రసాద్ చెప్పుకొచ్చారు.
నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడిస్తే మంచి ఫలితాలు
వరల్డ్ కప్‌లో తన స్థానం గురించి ఆలోచించడం లేదని, అయితే నాలుగో స్థానంలో అనుభవం ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆడితే మంచి ఫలితాలు వస్తాయని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నారు. టీమిండియా ఆటగాళ్లు ఎక్కువ ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ క్రమంలో సొంతగడ్డపై టీమిండియాను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అకిల్ జావెద్ వెల్లడించారు. కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో భారత్ ను ఓడించడానికి పాక్‌కు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. భారత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక సమయంలో వారు విఫలం కావడంతో భారత్ విజేతగా నిలవలేకపోతోందని విండీస్ మాజీ ప్లేయర్ డారెన్ సామీ తెలిపారు.