Page Loader
Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026లో నిర్వహించబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ జూన్ 12, 2026న ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, వేల్స్‌ దేశాలలోని ఆరు ప్రముఖ క్రికెట్ మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించగా, ప్రతి గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో నుంచి టాప్‌-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి.

వివరాలు 

గ్రూపుల వివరాలు ఇలా ఉన్నాయి: 

గ్రూప్ 1 లో భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 లు ఉండగా, గ్రూప్ 2లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, క్వాలిఫయర్ 3, క్వాలిఫయర్ 4 జట్లు ఉండనున్నాయి. భారత్ తన టోర్నీ ప్రయాణాన్ని జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో ప్రారంభించనుంది. టీ20 ఫార్మాట్‌లో భారత్ పాకిస్తాన్‌పై పటిష్ఠమైన రికార్డు కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడ్డ 15 మ్యాచ్‌లలో భారత్ 12 విజయాలు సాధించింది. పాకిస్తాన్ భారత్‌పై చివరిసారిగా 2022లో జరిగిన మహిళల ఆసియా కప్‌లో విజయం సాధించింది.

వివరాలు 

డిఫెండింగ్ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ 

ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది గ్రూప్ 2లో ఆ జట్టు ప్రధాన బలంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు స్వదేశంలో ఆడటం వల్ల బలంగా ఉనికిని చూపే అవకాశముంది. భారత్ ఉన్న గ్రూప్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఆ జట్టు పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లో టాప్ జట్లైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇది భారత జట్టుకు నిజమైన పరీక్షగా మారనుంది.

వివరాలు 

భారత్ మ్యాచ్ షెడ్యూల్ ఇలా ఉంది: 

జూన్ 14: భారత్ vs పాకిస్తాన్ - ఎడ్జ్‌బాస్టన్ జూన్ 21: దక్షిణాఫ్రికా vs భారత్ - ఓల్డ్ ట్రాఫోర్డ్ జూన్ 28: భారత్ vs ఆస్ట్రేలియా - లార్డ్స్ ఈ మ్యాచ్‌ల అనంతరం సెమీ ఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ది ఓవల్ మైదానంలో నిర్వహించనున్నారు. ఇక గ్రాండ్ ఫైనల్ జూలై 5న లార్డ్స్ వేదికగా జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐసీసీ చేసిన ట్వీట్