ODI WC 2023 : వన్డే వరల్డ్ కప్ సంగ్రామంలో బద్దలయే రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామం నేటి నుంచి మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఇప్పటికే ఆయా జట్లు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు కీలక రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ శర్మ
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సలను మంచినీళ్లు తాగినంత సులువుగా బాదడంలో ప్రసిద్ధుడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్ గేల్ అత్యధికంగా 551 ఇన్నింగ్స్‌లో 553 సిక్సుల బాది అగ్రస్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ కేవలం 471 ఇన్నింగ్స్ లో 551 సిక్సులను బాదాడు.
మరో మూడు సిక్సులు కొడితే గేల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Details
వన్డేల్లో 47 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ
ఇక వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు చేసేందుకు రోహిత్ 22 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇక మరో శతకం చేస్తే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలువనున్నాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 47 సెంచరీలును కొట్టాడు.
మరో మూడు శతకాలు చేస్తే సంఖ్య హాఫ్ సెంచరీకి చేరే అవకాశం ఉంటుంది.
విరాట్ ఒక్క క్యాచ్ పడితే వరల్డ్ కప్‌లో భారత్ తరుఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన పీల్డర్ గా మారనున్నాడు.
Details
5వేల పరుగులకి చేరువలో జోస్ బట్లర్
జోస్ బట్లర్
వన్డేల్లో ఓ అరుదైన మైలురాయిని చేరుకోవడానికి జోస్ బట్లర్ దగ్గరయ్యాడు. వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు.
ఇప్పటివరకూ అతను 4823 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి.
మరో 177 పరుగులు చేస్తే 5వేల పరుగుల జాబితాలోకి చేరుతాడు. జో రూట్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్
జో రూట్
వరల్డ్ కప్ టోర్నీల్లో ఇప్పటివరకూ 16 ఇన్నింగ్స్ లో 758 పరుగులు చేశాడు.
మరో 140 పరుగులను చేస్తే ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.
Details
అరుదైన రికార్డును చేరువలో మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా బౌలర్ వరల్డ్ కప్ లో 18 మ్యాచులు ఆడి 49 వికెట్లు తీశారు.
మరొక వికెట్ తీస్తే ఆసీస్ తరుఫున 50 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలవనున్నాడు.
గ్లెన్ మెక్ గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ట్రెంట్ బౌల్ట్
వన్డేల్లో 200 వికెట్లను పూర్తి చేయడానికి న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మరో 3 వికెట్ల దూరంలో ఉన్నాడు.
ప్రస్తుతం 104 మ్యాచుల్లో 197 వికెట్లను పడగొట్టాడు.
ఈ వరల్డ్ కప్ లో మరో 18 వికెట్లను సాధిస్తే కివీస్ తరుఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలుస్తాడు.
Details
వెయ్యి పరుగులకు చేరువలో డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే వరల్డ్ టోర్నీలలో వెయ్యి పరుగులను పూర్తి చేయడానికి మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు.
గతంలో రికీ పాంటింగ్ (1743), ఆడమ్ గిల్ క్రిస్ట్ (1085), మార్క్ వా (1004) మాత్రమే వార్నర్ కంటే ముందు ఉన్నారు.
ఇక మరో శతకాలు చేస్తే వరల్డ్ కప్ ఈవెంట్లో అత్యధిక సెంచరీలు బాదిసన ఆసీస్ ఆటగాడిగా రికార్డును నెలకొల్పనున్నాడు.
వార్నర్ 4 సెంచరీలు చేయగా.. రికీ పాంటింగ్ 5 సెంచరీలు సాధించాడు.