ICC Rankings : ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన యశస్వీ, కోహ్లీ.. దిగజారిన బాబార్ అజామ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. భారత క్రికెటర్లు తమ ప్రదర్శనతో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఇక రోహిత్ శర్మ టాప్-10లో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రం తన స్థానం నుండి ఆరు స్థానాలు కిందకి పడిపోయాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 881 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్‌లతో రూట్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (859 పాయింట్లు), డారిల్ మిచెల్ (768 పాయింట్లు) రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతుండడం గమనార్హం.
రోహిత్ శర్మ
టీమిండియా ఆటగాళ్లలో యశస్వీ జైస్వాల్ (740 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో ర్యాంక్‌కు చేరాడు. విరాట్ కోహ్లీ (737 పాయింట్లు) రెండు స్థానాలు పైకి ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరాడు. రోహిత్ శర్మ (751 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. బాబర్ అజామ్ (734 పాయింట్లు) ఆరు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ (728 పాయింట్లు) ఏడు స్థానాలు ఎగబాకి టాప్-10లో స్థానం సంపాదించాడు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (758 పాయింట్లు) మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు.