Loading...
Yashveer Gowd: పాక్‌పై విజయం తర్వాత మైదానంలో రెచ్చిపోయిన తెలంగాణ కుర్రోడు
పాక్‌పై విజయం తర్వాత మైదానంలో రెచ్చిపోయిన తెలంగాణ కుర్రోడు

Yashveer Gowd: పాక్‌పై విజయం తర్వాత మైదానంలో రెచ్చిపోయిన తెలంగాణ కుర్రోడు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన థ్రిల్లింగ్ విజయం ఎంతగా వైరల్ అయిందో.. ఆ తర్వాత తెలంగాణ కుర్రాడు యశ్‌వీర్ గౌడ్ చేసిన సెలబ్రేషన్స్ కూడా అంతే హాట్ టాపిక్‌గా మారాయి. మ్యాచ్‌లో ఓటమి తప్పదేమో అనిపించిన దశ నుంచి టీమిండియా అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. ఆ గెలుపు తర్వాత యశ్‌వీర్ పాకిస్థాన్ ఆటగాడు హంజా జహూర్ దగ్గరకు వెళ్లి అతడి కళ్లలోకి చూస్తూ గర్జించినట్టుగా చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

లీగ్ మ్యాచ్‌లో హంజా ఇచ్చిన షాక్

ఈ కథకు అసలు నేపథ్యం లీగ్ దశలోనే మొదలైంది. భారత్‌ తొలుత పాకిస్థాన్‌పై 208 పరుగులు మాత్రమే చేసింది.

భారత బౌలర్లు మాత్రం ఆ జట్టును ఆరంభంలోనే ఇబ్బందుల్లోకి నెట్టారు. ఒక దశలో పాకిస్థాన్ 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయం దాదాపు ఖాయమనిపించింది.

కానీ వికెట్ కీపర్ బ్యాటర్ హంజా జహూర్ అద్భుతంగా పోరాడి 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

హస్నైన్ అబ్బాస్ దార్‌తో కలిసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత హంజా చేసిన సెలబ్రేషన్ కూడా అప్పట్లో చర్చగా మారింది.

Details

ఫైనల్లో లెక్క సరిచేసిన టీమిండియా

లీగ్ మ్యాచ్‌లో ఎదురైన ఆ పరాభవాన్ని భారత కుర్రాళ్లు ఫైనల్లో మర్చిపోలేదు.

మరోసారి పాకిస్థాన్ ఎదురుపడటంతో మ్యాచ్ మొదటి బంతి నుంచే ఉత్కంఠ పెరిగింది.

చివరకు భారత్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఓటమి అంచుల నుంచి బయటపడి సాధించిన ఈ గెలుపుతో భారత ఆటగాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

ఆ సమయంలో యశ్‌వీర్ గౌడ్ చేసిన సెలబ్రేషన్ ప్రత్యేకంగా నిలిచింది. హంజా జహూర్ వైపు నేరుగా వెళ్లి కళ్లలోకి చూస్తూ గట్టిగా గర్జించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ADVERTISEMENT

Details

ఎవరీ యశ్‌వీర్ గౌడ్?

యశ్‌వీర్ గౌడ్ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా రాజాపేటకు చెందిన కుర్రాడు.

ప్రస్తుతం ఈ ప్రాంతం భువనగిరి జిల్లా పరిధిలో ఉంది. అతడి కుటుంబం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో స్థిరపడింది.

హైదరాబాద్ అండర్-19 జట్టులో ఆడిన యశ్‌వీర్ తన ప్రతిభతో బీసీసీఐ దృష్టిని ఆకర్షించాడు.

బెంగళూరులో జరిగిన బీసీసీఐ శిక్షణ శిబిరంలోనూ మెప్పించాడు. దీంతో శ్రీలంకతో జరిగిన అండర్-19 వన్డే సిరీస్‌కు బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు.

ADVERTISEMENT

Details

తుది జట్టులో లేకపోయినా.. వైరల్ అయ్యాడు

ఆ తర్వాత ఆసియా కప్ జట్టులోనూ యశ్‌వీర్‌కు చోటు దక్కింది. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

అయినా భారత్ విజయం తర్వాత అతడి సెలబ్రేషన్ మాత్రం అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.

ముఖ్యంగా పాకిస్థాన్ ఆటగాడి ఎదురుగా నిలబడి చేసిన ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్ రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు దారితీసింది.

మ్యాచ్‌లో ఆడకపోయినా.. ఫైనల్ తర్వాత సోషల్ మీడియాలో మాత్రం యశ్‌వీర్ గౌడ్ పేరు మార్మోగిపోయింది.

ADVERTISEMENT