తదుపరి వార్తా కథనం
Earthquake: కరేబియన్ సముద్రంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 09, 2025
08:55 am
ఈ వార్తాకథనం ఏంటి
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6గా నమోదైంది.
ఈ భూకంపం హోండురస్‌కు ఉత్తరంగా ఏర్పడి, కొలంబియా, కోస్టారికా, నికరాగువా, క్యూబా దేశాలపై ప్రభావం చూపింది. అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ఈ భూకంపానికి సంబంధించి సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
అయితే అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని స్పష్టంగా పేర్కొంది.
క్యూబా తీరప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 1-3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.