
Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్‌పై దాడులకు అవసరమైన డ్రోన్లను టర్కీ టర్నీ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు అండగా నిలవడంపై ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో భారత్‌లోని పర్యాటకులు తమ టూర్‌లను టర్కీ, అజర్‌బైజాన్‌కు రద్దు చేసుకుంటున్నారు.
లభించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారుగా 2వేల మంది భారతీయ పర్యాటకులు టర్కీ, అజర్‌బైజాన్ టూర్‌లను రద్దు చేసుకున్నారు.
ప్రధానంగా మే నుండి జూలై మధ్య కాలంలో జరగాల్సిన పర్యటనలను ఈ ప్రయాణికులు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
వివరాలు
టూర్ల క్యాన్సిలేషన్‌లు 260 శాతం మేర పెరిగింది
మొత్తం ప్రయాణికుల్లో దాదాపు 5 శాతం మంది తమ పర్యటనల్ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రముఖ ట్రావెల్ సర్వీస్ సంస్థ 'యాత్ర' సీఓఓ మాట్లాడుతూ, ఈ రెండు దేశాలకు సంబంధించిన టూర్ ప్యాకేజీల్లో 50 శాతం వరకు రద్దులు నమోదవుతున్నాయని తెలిపారు.
అంతేకాకుండా 'క్లియర్ ట్రిప్' సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, టర్కీ, అజర్‌బైజాన్ టూర్ల క్యాన్సిలేషన్‌లు 260 శాతం మేర పెరిగినట్టు పేర్కొన్నారు.
ఇక మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా తన ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.
వివరాలు
మనదేశంలో కూడా టర్కీ, అజర్‌బైజాన్ కంటే అందమైన ఎన్నో ప్రదేశాలు
గత ఏడాది భారత్ నుంచి టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు పర్యాటక రంగం ద్వారా రూ.4,000 కోట్లకు మించిన ఆదాయం లభించిందని, ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థ, హోటళ్ల పరిశ్రమ, విమానయాన రంగం సహా అనేక రంగాలకు ఉపాధి కల్పించిందని తెలిపారు.
కానీ పహల్గామ్ ఘటన అనంతరం ఈ దేశాలు పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తీరు గమనించదగినదని పేర్కొన్నారు.
ప్రపంచంలో, అలాగే మనదేశంలో కూడా టర్కీ, అజర్‌బైజాన్ కంటే అందమైన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయని గోయంకా అభిప్రాయపడ్డారు.
అందుకే ఈ పరిస్థితుల్లో భారత పర్యాటకులు ఈ దేశాలకు వెళ్లే అవసరం లేదని సూచించారు.