
Canada: అమెరికా వాహనాలపై కెనడా 25శాతం ప్రతీకార సుంకాలు సుంకాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుంచి దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
ఈ అంశాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
అమెరికా ప్రభుత్వం తీసుకున్న సుంకాల చర్యలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
కెనడా-యునైటెడ్ స్టేట్స్-మెక్సికో ఒప్పందం (CUSMA) పరిధిలోకి రాని అన్ని వాహనాలపై ఈ సుంకాలు వర్తించనున్నాయని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య విధానాలకు బదులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్నీ పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా-కెనడా సంబంధాల్లో ఉద్రిక్తతలు
''ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే ఈ వాణిజ్య సంక్షోభానికి మూలకారణం. కెనడా మాత్రం తన లక్ష్యాన్ని సాధించేందుకు బలంగా స్పందించింది,'' అని ఆయన వ్యాఖ్యానించారు.
"కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ మాట్లాడుతూ ''అకారణంగా అమెరికా విధించిన సుంకాలపై కెనడా శక్తిమేరకు స్పందిస్తూనే ఉంటుంది. ఈ సుంకాలను తొలగింపజేసి.. కెనడా ఉద్యోగులు, వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'' అని పేర్కొన్నారు."
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా-కెనడా సంబంధాల్లో ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి.
ముఖ్యంగా సుంకాల విధానం వల్ల ఈ వివాదం మరింత తీవ్రతకు చేరుకుంది.
మార్చి 4న అమెరికా ప్రభుత్వం కెనడా వస్తువులపై 25శాతం టారిఫ్ విధించగా, ఇంధన వస్తువులు, పొటాష్‌పై 10 శాతం టారిఫ్ విధించింది.
వివరాలు
"చాలా దేశాలు ఒప్పందాల కోసం తహతహలాడుతున్నాయి":ట్రంప్
మొదట ఇది CUSMA ఒప్పంద పరిధిలోకి రాని వస్తువులపై మాత్రమే వర్తించింది.
తర్వాత మార్చి12న కెనడా నుంచి దిగుమతయ్యే ఉక్కు,అల్యూమినియం ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించబడింది.
ఇక ఏప్రిల్ 3నవాహనాలపై,మే 3న విడిభాగాలపై కూడా 25శాతం చొప్పున పన్నులు అమలయ్యాయి.
కెనడా కూడా ఇదే తీరులో స్పందిస్తూ,అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై తగినట్లుగా సుంకాలు విధించింది.
అమెరికా సుంకాల దెబ్బకు అనేక దేశాలు వాణిజ్యఒప్పందాల కోసం తీవ్రంగా ఆసక్తి చూపిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ డిన్నర్‌లో మాట్లాడుతూ,''దయచేసి సార్, ఓ ఒప్పందం చేద్దాం''అంటూ చాలా దేశాలు తనను అభ్యర్థిస్తున్నాయని తెలిపారు.
అయితే ఈదేశాల పేర్లను ఆయన వెల్లడించలేదు.సమాచారం ప్రకారం,వియత్నాం,ఇజ్రాయెల్, దక్షిణ కొరియా నాయకులు ట్రంప్‌కు ఫోన్ ద్వారా సంప్రదించారని చెబుతున్నారు.