Page Loader
Rafale jets: ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ జెట్‌లపై చైనా తప్పుడు ప్రచారం 
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ జెట్‌లపై చైనా తప్పుడు ప్రచారం

Rafale jets: ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ జెట్‌లపై చైనా తప్పుడు ప్రచారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమ దేశం రూపొందిస్తున్న రఫెల్‌ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఫ్రాన్స్‌ తీవ్రంగా విమర్శించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్‌ ఫైటర్ల విక్రయాలను ఇబ్బంది పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ఆరోపించింది. ఈదుష్ప్రచారానికి చైనా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్నదౌత్య,రక్షణ విభాగాల ప్రతినిధులే కీలకపాత్ర పోషిస్తున్నారని ఫ్రెంచ్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫెల్‌ విమానాల కొనుగోలుకు బదులుగా చైనా తయారు చేసిన యుద్ధ విమానాలను తీసుకోవాలని సూచిస్తూ వివిధ దేశాలను ప్రభావితం చేయడానికి చైనా ప్రయత్నిస్తోందని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. తమ దేశ ఆర్థిక ఆదాయం ఎక్కువగా రఫెల్‌ విమానాల ఎగుమతుల మీదే ఆధారపడి ఉందని,దాన్ని బలహీనపర్చేందుకు చైనా ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని ఫ్రాన్స్‌ ఆరోపించింది.

వివరాలు 

రఫెల్‌పై నమ్మకాన్ని తగ్గించేందుకు చైనా యత్నం 

ఈ దుష్ప్రచారానికి చైనా తన అధికార పరిమితుల్ని ఉపయోగించుకుంటోందని పేర్కొంది. పాకిస్థాన్‌ కూడా ఈ ప్రచారంలో భాగస్వామిగా వ్యవహరిస్తోందని ఫ్రాన్స్‌ ఆరోపించింది. ఈ నకిలీ ప్రచారంలో భాగంగా, 2024 మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణ సందర్భంగా రఫెల్‌ సహా ఐదు భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ కూల్చిందని వచ్చిన అసత్య వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్‌ వెల్లడించింది. ఈ వాదనకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా, వాటిని ప్రాచుర్యంలోకి తేవడం ద్వారా రఫెల్‌పై నమ్మకాన్ని తగ్గించేందుకు చైనా యత్నిస్తోందని తెలిపింది.

వివరాలు 

ఆన్లైన్‌ వేదికల్లో విస్తృతంగా ప్రచారం 

ఈ ప్రచారం ఆన్లైన్‌ వేదికల్లోనూ విస్తృతంగా జరుగుతోందని ఫ్రాన్స్‌ పేర్కొంది. ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసిన యుద్ధ విమానాల శిథిలాల చిత్రాలను చూపిస్తూ, చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను కలిగించే విధంగా ప్రచారం సాగుతోందని వెల్లడించింది. రఫెల్‌ కేవలం యుద్ధ విమానం మాత్రమే కాదు, అది ఫ్రాన్స్‌ వ్యూహాత్మక శక్తి, నమ్మకానికి చిహ్నమని తెలిపింది. అలాంటి ఓ ప్రఖ్యాత యుద్ధ విమానంపై చైనా ఇలాంటి అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగడం దురదృష్టకరమని ఫ్రాన్స్‌ ఖండించింది. ర

వివరాలు 

ఫ్రాన్స్‌ నుంచి 42 రఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన ఇండోనేషియా

ఫెల్‌ యుద్ధ విమానాలను తయారు చేసే డసెల్ట్‌ ఏవియేషన్‌ ఇప్పటివరకు మొత్తం 533 యుద్ధ విమానాలను పలు దేశాలకు విక్రయించింది. ఈజిప్ట్‌, భారత్‌, ఖతర్‌, గ్రీస్‌, క్రొయేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సెర్బియా, ఇండోనేషియా వంటి దేశాలకు రఫెల్‌ ఫైటర్లు విక్రయించారు. ఇప్పటికే ఇండోనేషియా ఫ్రాన్స్‌ నుంచి 42 రఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఇంకా ఎక్కువ సంఖ్యలో విమానాల కొనుగోలు అవకాశాలపై పరిశీలన జరుపుతోందని ఫ్రాన్స్‌ వర్గాలు తెలిపాయి.