LOADING...
Nikki Haley: భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. ట్రంప్‌ హెచ్చరికల వేళ నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రంప్‌ హెచ్చరికల వేళ నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Nikki Haley: భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. ట్రంప్‌ హెచ్చరికల వేళ నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ లాంటి శక్తివంతమైన మిత్ర దేశంతో అమెరికా తన బంధాలను దిగజార్చుకోకూడదని,భారత మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ హితవు పలికారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ మంచి భాగస్వామి కాదంటూ,దాని మీద భారీగా సుంకాలు పెంచుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో,నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్‌ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో,''భారత్‌ రష్యా నుంచి చమురు కొనకూడదు కానీ,అదే సమయంలో చైనా ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేస్తోంది కదా? ఇలాంటి ద్వంద్వ ధోరణి ఏంటీ?'' అంటూ ప్రశ్నించారు.

వివరాలు 

చైనాకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే.. 

చైనా రష్యా, ఇరాన్‌ల నుంచి అత్యధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, చైనాకు మాత్రం 90 రోజుల పాటు సుంకాల మినహాయింపునిచ్చారు అంటూ ట్రంప్ పాలనను విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారత్ లాంటి విశ్వసనీయ మిత్ర దేశంతో అనవసరంగా దూరం పెంచుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. చైనాకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడం అమెరికా ప్రయోజనాలకు అనుకూలమని ఆమె సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిక్కీ హేలీ చేసిన ట్వీట్