
Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు మద్దతుగా ప్రపంచ దేశాలు నిలుస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఈ సంఘటనపై చర్చించారు.
ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికారికంగా వెల్లడించింది.
విదేశాంగ శాఖ ప్రకారం.. "ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.దాడికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు భారత్‌కు పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని తెలిపారు. మోదీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు" అని పేర్కొంది.
ప్రధాని మోదీ, ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అండగా నిలుస్తున్న అంతర్జాతీయ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
ఈదాడిపై ట్రంప్ ముందుగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.భారత్‌తో కలిసి నిలుస్తామని,ఈ విషయంలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు.ఇలాంటి ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
దాడికి పాల్పడిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఈ రోజు పహల్గాం ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు.
పహల్గాం పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.హోం మంత్రి ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
ఉగ్రవాదులు వెళ్లిన అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
ఎలాంటి పరిస్థితులలోనూ ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని భద్రతాదళాలు స్పష్టం చేస్తున్నాయి.