LOADING...
Donald Trump: భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించిన ట్రంప్‌.. ఆగస్టు 27 నుంచి అమల్లోకి..
భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించిన ట్రంప్‌.. ఆగస్టు 27 నుంచి అమల్లోకి..

Donald Trump: భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించిన ట్రంప్‌.. ఆగస్టు 27 నుంచి అమల్లోకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
07:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి షాక్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతపై ఆయన మరో 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమలు చేసిన ట్రంప్‌, ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో అదనపు టారిఫ్‌ విధించడంతో, భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై మొత్తం 50 శాతం దిగుమతి సుంకం వర్తించనుంది. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్‌పై ట్రంప్‌ సుంకాల మోత

వివరాలు 

భారత్‌ కూడా దీన్ని ప్రతీకార చర్యగా భావించి సుంకాలు పెంచే ప్రయత్నం చేస్తే..

రష్యా చమురు కొనుగోళ్లను ముఖ్య కారణంగా పేర్కొంటూ,భారతదేశం నేరుగా లేదా పరోక్షంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం వల్లే ఈ అదనపు టారిఫ్‌లు విధించాల్సి వచ్చిందని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ ప్రతీకార చర్యల్లో భాగంగా, ముందుగా ప్రకటించిన 25 శాతం సుంకం ఈ ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా, తాజాగా విధించిన అదనపు 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమలులోకి రానుంది. మరోవైపు, భారత్‌ కూడా దీన్ని ప్రతీకార చర్యగా భావించి సుంకాలు పెంచే ప్రయత్నం చేస్తే, ఈ టారిఫ్‌లను అధ్యక్షుడు సవరించే అధికారం కలిగి ఉన్నారని వైట్‌హౌస్‌ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడే ఆసక్తికర అంశంగా మారింది.

వివరాలు 

స్పందించిన కాంగ్రెస్‌.. 

ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై మొత్తం 50 శాతం సుంకాన్ని విధించారని స్పష్టంగా పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ, ఆయన భారత్ పై తీసుకుంటున్న చర్యలపై ఎటువంటి విమర్శలు చేయకుండా మౌనంగా ఉండటం అత్యంత ఆశ్చర్యకరమని విమర్శించింది. కనీసం ఇప్పుడు అయినా ధైర్యంగా మాట్లాడాలని, ట్రంప్‌ నిర్ణయాలకు సరైన ప్రతిస్పందన ఇవ్వాలని కోరుతూ 'ఎక్స్‌'లో పోస్టు పెట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్‌ చేసిన ట్వీట్