Donald Trump: టారిఫ్ విధిస్తానన్న తర్వాత బ్రిక్స్ మాటే వినిపించడం లేదు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిక్స్ (BRICS) కూటమిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేశారు.
తాజాగా, ఆయన అదే విధంగా వ్యాఖ్యానిస్తూ, బ్రిక్స్ కూటమి భవిష్యత్తుపై వ్యంగ్యంగా మాట్లాడారు.
''డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెడతామని చెప్పగానే, నేను 'బ్రిక్స్'పై 150 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించాను. దాంతో, ఆ దేశాలు పరస్పరం దూరమయ్యాయి. తర్వాత ఆ కూటమి గురించి ఎలాంటి చర్చ వినిపించలేదు'' అని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేశియా, ఇరాన్, యూఏఈ ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి.
వివరాలు
ఆ దేశాల దిగుమతులపై 100% సుంకం
ట్రంప్ ఇప్పటికే "యూఎస్ డాలర్‌ను పక్కనపెడితే ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది" అని పలుమార్లు వ్యాఖ్యానించారు.
బ్రిక్స్ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని రూపొందించలేవని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ వారు డాలర్‌ను వదులుకుంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు రావాల్సి వస్తుంది.
తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరో వాణిజ్య భాగస్వామిని వెతకాల్సి వస్తుందని తెలిపారు.
అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే, ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తామని, అమెరికాతో వాణిజ్యాన్ని కోల్పోతారనే విషయం తెలుసుకోవాలని గతంలోనే హెచ్చరించారు.
వివరాలు
రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
గత అక్టోబరులో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి డిజిటల్ కరెన్సీని వినియోగించుకోవాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీని వాడేందుకు భారత్‌తో కలిసి రష్యా పని చేస్తోందని పేర్కొన్నారు.
కొత్త ఆర్థిక వ్యవస్థలను అన్వేషించాలని, దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామని పుతిన్ వివరించారు.
అయితే, అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన జియో-ఎకనామిక్స్ సెంటర్ చేసిన అధ్యయనం ప్రకారం, బ్రిక్స్ దేశాలు ఎంతగా ప్రయత్నించినా డాలర్‌పై ప్రపంచ దేశాలు ఆధారపడటం పూర్తిగా తగ్గించలేవని తేలింది.