Elon Musk: రహస్య ప్రదేశంలో ఇరాన్ యుఎన్ రాయబారితో ఎలాన్ మస్క్ సమావేశం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితికి ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ, వ్యాపారవేత్త, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌తో రహస్య ప్రదేశంలో ఒక గంటలపాటు సమావేశం నిర్వహించినట్లు ఇరాన్ నుండి వచ్చిన విశ్వసనీయ వర్గాలు ప్రకటించాయి. ఈ సమావేశంలో, ఇరాన్ రాయబారి, టెహ్రాన్‌లో వ్యాపార లావాదేవీలు ప్రారంభించేందుకు అనుమతిని కోరుతూ, అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపును కోరినట్లు తెలుస్తుంది. ఈ పరిణామం, యునైటెడ్ స్టేట్స్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.
రహస్య సమావేశాన్ని ట్రంప్ బృందం లేదా ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ ధృవీకరించలేదు
ఇక, 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం నుండి డొనాల్డ్ ట్రంప్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆయన అణు ఒప్పందం నుంచి వెనక్కి పోవడమే కాకుండా, ఇరాన్ చమురు ఎగుమతులపై నియంత్రణను పెంచి గరిష్ట ఒత్తిడి విధించారు. అటు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్‌తో సైనిక చర్యలు నిర్వహించడం ద్వారా ట్రంప్‌కు బలమైన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ రహస్య సమావేశాన్ని ట్రంప్ బృందం లేదా ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ ఇంకా ధృవీకరించలేదు. దౌత్య సంబంధాలను నెలకొల్పాలని ట్రంప్‌కు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, మస్క్,ఇరాన్ రాయబారితో జరిగిన సమావేశం మరింత చర్చలకు కారణమవుతుంది. అయితే, ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్‌లోని సంప్రదాయవాదులు, అలాగే రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.