
Balendra Shah: ఇంజనీర్,రాపర్,మేయర్,ఇప్పుడు ప్రధానమంత్రి? నేపాల్ నిరసనల వెనుక ఈయనేనా? ఎవరీ బాలేన్ షా?
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఏకంగా నిషేధం విధించడమే, అక్కడ రాజకీయ సంక్షోభానికి దారితీసింది. యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి, ఫలితంగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్,ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిరసనల వెనుక నేపాల్ రాజధాని కాఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు, ఆయనే తదుపరి ప్రధానిగా కొనసాగాలని ఆన్‌లైన్‌లో భారీ క్యాంపెయిన్ ఊపందుకుంది. అందువల్ల, జనరల్ జెడ్ పేరుతో యువత చేపట్టిన ఆందోళనలో ఆయనే కీలకంగా వ్యవహరించారనే అనుమానాలు బలపడుతున్నాయి.
vivaralu
19 మంది ప్రాణాలు కోల్పోగా,మూడు వందల మందికిపైగా గాయాలు
గత వారం,ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం వ్యతిరేకంగా యువత గళమెత్తారు. దీంతోపాటు,దేశ వ్యాప్తంగా అవినీతి పెరిగిపోవడం,ప్రభుత్వ వ్యవస్థ ధ్వంసం అవుతోందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆందోళనలు తీవ్రమై,రక్తపాతం చోటుచేసుకుంది. ఫలితంగా 19 మంది ప్రాణాలు కోల్పోగా,మూడు వందల మందికిపైగా గాయపడ్డారు. అందులో ముఖ్యంగా కాఠ్మాండూ నగరంలో 18మంది మరణించారు.వీరిలో చాలా మంది స్కూల్, కాలేజీ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులే. ఈ ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ బాలేంద్ర షా తన వయసు కారణంగా ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొనలేకపోతున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కానీ,జనరల్ జెడ్ ఉద్యమంలో 28ఏళ్ల లోపు యువత మాత్రమే పాల్గొనాలని నిర్వాహకులు పరిమితి విధించారు.
వివరాలు
నేపాల్ కొత్త ప్రధానిగా షా?
బాలేంద్ర షా మాట్లాడుతూ, ''ఈ ర్యాలీ పూర్తిగా జనరల్ జెడ్ ఆకస్మిక ఉద్యమంగా సాగుతోంది. నేను వారికన్నా వయసులో పెద్దవాడిని,అయినప్పటికీ వారి లక్ష్యాలు,ఆశయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు,నాయకులు,శాసనసభ్యులు ఈ ఉద్యమాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం మంచిది కాదు. భౌతికంగా హాజరు కాలేను కానీ నా పూర్తి మద్దతు యువతకు ఉంది'' అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పలువురు అతన్ని ప్రధాన పదవికి సూచిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఒక నెటిజన్ అభిప్రాయం ప్రకారం, ''బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే, మన దేశం కోసం పనిచేసే స్వచ్ఛమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే తగిన నాయకుడు, వచ్చే ప్రధాని బాలేంద్ర షా'' అన్నారు.
వివరాలు
నేపాల్ కొత్త ప్రధానిగా షా?
మరో నెటిజన్, ''మనం ఇక్కడితో ఆగలేం. యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులతో సహా నేపాల్ జనరేషన్ జెడ్ 19 మంది భారీ మూల్యం చెల్లించారు. ఫలితం అందించేవరకు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు బాలేంద్ర లాంటి నాయకుడు కావాలి'' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఎవరీ బాలేంద్ర షా?
బాలెన్‌గా గుర్తింపు పొందిన ఆయన అసలు పేరు బాలేంద్ర షా.ప్రస్తుతం కాఠ్మాండూ మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1990లోజన్మించిన బాలెన్,నేపాల్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. రాజకీయ రంగానికి ముందుగా,నేపాల్ అండర్‌గ్రౌండ్ హిప్-హాప్ సన్నివేశంలో ర్యాపర్,గేయ రచయితగా చురుకుగా వ్యవహరించారు.తరచూ తన సంగీతం ద్వారా అవినీతి,అసమానత వంటి అంశాలను లేవనెత్తారు. 2022లోస్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మాండూ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి 60,000కిపైగా మెజార్టీ ఓట్లు సాధించి విజయం సాధించారు. ఈఎన్నికలో 'బాలెన్ ఎఫెక్ట్' పేరిట యువతను ఆకట్టుకున్నారు.ఆయన భార్య సబీనా కఫ్లే కూడా సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా గతేడాది ఫిబ్రవరిలో నేపాాల్‌లో అమెరికా రాయబారిని షా కలవడం గమనార్హం.