Page Loader
voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 
భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన

voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ నిధులను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత్‌కు అందిస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్, బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలకు ఎన్నికల నిధుల రూపంలో కోట్లాది డాలర్లు అందించే ప్రణాళికను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్‌) ఆదివారం వెల్లడించింది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును అర్థరహిత కార్యక్రమాలకు వినియోగించడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో, అనవసర నిధులన్నింటిని నిలిపివేస్తున్నామని ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) వేదికగా డోజ్ ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డోజ్‌ చేసిన ట్వీట్ 

వివరాలు 

భారత్‌కు నిధుల నిలుపుదలపై పెరుగుతున్న వివాదం 

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ ఖర్చులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా డోజ్‌ను ఏర్పాటు చేసినట్లు ఇదివరకే వెల్లడైంది. "భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు 21 కోట్ల డాలర్ల నిధులను కేటాయించాం. ఇకపై ఆ సహాయాన్ని నిలిపివేస్తున్నాం" అని డోజ్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయిన మూడు రోజులకే ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ నిధులు ఎప్పుడు, ఎంత తరచుగా, ఎవరికీ అందించబడ్డాయి అనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై భారతీయ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత ఎన్నికల వ్యవస్థలో . విదేశీ జ్యోకమేంటంటూ బీజేపీ విమర్శించింది.

వివరాలు 

భారత ఎన్నికల వ్యవస్థలో విదేశీ ప్రభావం? 

''ఓటింగ్‌ శాతం పెంచడానికి 21 కోట్ల డాలర్లా? దీని వల్ల ఎవరికి లాభం? ఇది అధికార పార్టీకైతే కాదు!'' !'' అంటూ బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవ్య ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నిధులు గతంలో యూపీఏ ప్రభుత్వం అందుకుందని ఆరోపించారు. 2012లో, ఆ సమయంలో ప్రధాన ఎన్నికల అధికారి అయిన ఎస్‌.వై. ఖురేషి నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సోసైటీ ఫౌండేషన్ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన ఆరోపించారు. భారత ఎన్నికల వ్యవస్థపై విదేశీ ప్రభావాన్ని అంగీకరించడమే ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అమిత్ మాలవ్య  చేసిన ట్వీట్ 

వివరాలు 

CEPPS అంటే ఏమిటి? 

ఇక, బంగ్లాదేశ్‌ రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు కేటాయించిన 2.9 కోట్ల డాలర్ల నిధులను కూడా నిలిపివేస్తున్నట్లు డోజ్‌ స్పష్టం చేసింది. అదనంగా 15కి పైగా దేశాలకు ఇస్తున్న నిధులను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. CEPPS అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ద్వారా నిధులు పొందే లాభాపేక్షలేని, పక్షపాతరహిత, ప్రభుత్వేతర సంస్థలను కలిగి ఉంది, వీటిని ట్రంప్ మూసివేయాలనుకుంటున్నారు.

వివరాలు 

ఎక్స్‌ లో స్పదించిన మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి

అమెరికా ఇచ్చే 21 మిలియన్‌ డాలర్ల సాయాన్ని నిలిపివేసిందన్న వార్తలపై ఖురేషి ఎక్స్‌లో స్పందించారు. 'భారతదేశంలో ఓటర్ టర్నౌట్ విషయంలో సహాయం కోసం నేను సీఈసీగా ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదనే విషయం పూర్తిగా నిజం.నేను 2012లో సీఈసీగా ఉన్నప్పుడు,మేము కేవలం ఐఎఫ్‌ఈఎస్‌తో (IFES) సిబ్బంది శిక్షణ కోసం మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందంలో ఎలాంటి ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రస్తావన లేదు. అలాగే, ఆర్థిక లేదా న్యాయపరమైన బాధ్యతలు ఉండవని స్పష్టంగా పేర్కొన్నాం' అని ఖురేషి తెలిపారు.