
Nepal: సోషల్ మీడియా నిషేధంపై నేపాల్‌లో తీవ్ర ఆందోళనలు.. 16 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం తీవ్ర నిరసన , హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. నేడు కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసగా మారి, 16 మంది మృతిచెందగా, 80 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్ భవనం ఎదురు దూసుకొస్తున్న సమయంలో భద్రతా దళాలతో ఘర్షణ జరిగింది. భద్రతా దళాలు నియంత్రణ కోసమై కాల్పులు చేయాల్సి వచ్చి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వేల మంది యువతతో కాఠ్‌మాండు జనసముద్రంగా మారిపోయింది. పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లను కూడా వారు లెక్కచేయలేదు.
వివరాలు
రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు
నేపాల్ ప్రభుత్వం గత గురువారం కమ్యూనికేషన్లు,సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయని ఫేస్ బుక్,ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్,యూట్యూబ్, ఎక్స్ (పూర్వం ట్విట్టర్), రెడిట్, లింక్డిన్ లాంటి ప్రముఖ సోషల్ మాధ్యమాలపై నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుండి ఏడురోజుల్లోపు రిజిస్టర్ కావాల్సిన గడువు బుధవారం రాత్రికి ముగిసినా, అవి రిజిస్ట్రేషన్ చేయలేదు. కానీ టిక్‌టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ వంటి అనేక ఇతర యాప్‌లు నిడివి లోపు రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు మాత్రం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. ఆ దరఖాస్తులను ఆమోదించే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది.
వివరాలు
నిషేధం ప్రభావంతో నేపాలీ యువత తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంభాషించే అవకాశం
ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలపై ఈ నిషేధం ప్రభావంతో విదేశాల్లో ఉండి చదువు, ఉద్యోగం లేదా ఇతర కారణాల కోసం వ్యవహరిస్తున్న 70 లక్షల నేపాలీ యువత తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంభాషించే అవకాశాన్ని కోల్పోతున్నారు. నేపాల్ పాత్రికేయుల సమాఖ్య ఈ నిషేధాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వ నిషేధం పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాకుండా, రాజ్యాంగం ద్వారా భరోసా ఇచ్చిన సమాచార హక్కును కూడా కాలరాస్తోందని ఆ సంఘం అభిప్రాయపడ్డింది. అందువల్ల వెంటనే ఈ నిషేధాన్ని తొలగించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది.