Page Loader
India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్
టెస్లా సీఈఓ ఎలోన్​ మన్స్

India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్

వ్రాసిన వారు Stalin
Apr 28, 2024
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా(Tesla)సీఈఓ ఎలోన్ మస్క్(Elon Musk)ఆదివారం చైనా(China)లో పర్యటించారు. ఎలక్ట్రిక్ వాహనాల(Electronic Vehicles)దిగ్గజం టెస్లా చైనాను రెండవ అతిపెద్ద మార్కెట్(Market)కూడా భావిస్తోంది. టెస్లా కంపెనీ బాధ్యతల కారణంగా భారత(India)పర్యటనను ఎలోన్ మస్క్ వాయిదా వేసుకున్నసంగతి తెలిసిందే. భారత పర్యటనను వాయిదా వేసుకున్న వారంరోజుల తర్వాత ఎలోన్ మస్క్ చైనాలో పర్యటించడం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తో సమావేశమై భారత మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించాల్సి ఉంది. చైనాలో ఫుల్-సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సాఫ్ట్ వేర్‌ను విడుదల చేసేందుకు, దాని స్వయంప్రతిపత్త డ్రైవింగ్ కోసం అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు ఆమోదం కోసం బీజింగ్‌లోని చైనా అధికారులను కలవాలని కోరుతున్నారు.

Elon Musk-China Visit

డేటాను బదిలీ చేయని చైనా

సోషల్ మీడియా లో ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా త్వరలోనే ఎఫ్ ఎస్ డీ అతి త్వరలోనే చైనా వినియోగదారులకు అందుబాటులో ఉండవచ్చని తెలిపింది. అయితే ఎలోన్ మస్క్ చైనా పర్యటన పత్రికల్లో ఎక్కడా ప్రముఖంగా కనిపించకపోవడం గమనార్హం. టెస్లా, 2021 నుండి, చైనీస్ రెగ్యులేటర్‌లకు అవసరమైన విధంగా షాంఘైలో చైనా సేకరించిన మొత్తం డేటాను నిల్వ చేసింది. ఆ సమాచారాన్ని తిరిగి అమెరికాకు బదిలీ చేయలేదు. అమెరికా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీదారు టెస్లా సంస్థ నాలుగేళ్ల క్రితం దాని ఆటోపైలట్ సాఫ్ట్ వేర్ ఎఫ్ ఎస్ డీని విడుదల చేసింది. చైనాలో ఇంకా అది అందుబాటులోకి రాలేదు.