LOADING...
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ లండన్‌ పర్యటనలో అలజడి.. కారు వద్దకు దూసుకొచ్చిన ఖలిస్థానీ మద్దతుదారు
భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ లండన్‌ పర్యటనలో అలజడి..

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ లండన్‌ పర్యటనలో అలజడి.. కారు వద్దకు దూసుకొచ్చిన ఖలిస్థానీ మద్దతుదారు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత విదేశాంగ మంత్రి లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఖలిస్థానీ అతివాదులు ఆయన పర్యటనకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఒక దుండగుడు నేరుగా సుబ్రమణ్యం జైశంకర్ (S Jaishankar) కారు వద్దకు అత్యంత సమీపంగా దూసుకొచ్చాడు. లండన్ (London)లోని ఛాఠమ్ హౌస్‌లో వివిధ అధికారిక సమావేశాలను ముగించుకున్న అనంతరం జైశంకర్ బయటకు రాగానే ఖలిస్థానీ అనుకూలులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ జెండాలను ప్రదర్శిస్తూ గోలగోల చేశారు. అదే సమయంలో, ఒక వ్యక్తి విదేశాంగ మంత్రికి సంబంధించిన కారు దగ్గరకు వేగంగా దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా, దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు.

వివరాలు 

బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు

తక్షణమే అప్రమత్తమైన లండన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మిగతా నిరసనకారులను కూడా అక్కడి నుంచి తొలగించారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి. జైశంకర్ మార్చి 4న యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటనకు వెళ్లగా, ఈ పర్యటనను మార్చి 9 వరకు కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా, బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్య సంబంధాలు, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. అంతేగాక, "ప్రపంచంలో భారతదేశ అభివృద్ధి, దాని ప్రాముఖ్యత" అనే అంశంపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో