Page Loader
Abdul Aziz: పాకిస్తాన్ ఆసుపత్రిలో..26/11 ప్రధాన నిందితుడు లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి 
పాకిస్తాన్ ఆసుపత్రిలో..26/11 ప్రధాన నిందితుడు లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి

Abdul Aziz: పాకిస్తాన్ ఆసుపత్రిలో..26/11 ప్రధాన నిందితుడు లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మరణించాడు. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు,చివరికి మే 6న మరణించినట్లు సమాచారం. అదే రోజున భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా జరిగిన క్షిపణి దాడిలో అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరికి అతను అత్యంత సన్నిహితుడని సమాచారం.

వివరాలు 

వివిధ ఉగ్రవాద చర్యలకు అవసరమైన లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా సమకూర్చినట్లు సమాచారం

అబ్దుల్ అజీజ్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ నిధుల సమకూర్చే నిర్వాహకుడు. అతని అంత్యక్రియల దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అందులో డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరితో పాటు లష్కర్‌కు చెందిన మరో కీలక నాయకుడు అబ్దుర్ రవూఫ్ కూడా ఉన్నారు. వీరు అజీజ్ మృతికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు ఆ దృశ్యాలలో కనిపిస్తోంది. గతంలో అబ్దుల్ అజీజ్ గల్ఫ్ దేశాల్లోని చురుకైన ఇస్లామిక్ సంస్థలతో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), యునైటెడ్ స్టేట్స్‌ (US)లోని పాకిస్తాన్ సముదాయాల నుండి నిధులను సేకరించినట్లు తెలిసింది. అతను వివిధ ఉగ్రవాద చర్యలకు అవసరమైన లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా,ఉగ్రవాదుల నియామకాలను కూడా సమకూర్చినట్లు సమాచారం.

వివరాలు 

ఆయుధాలను సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరించిన అబ్దుల్ అజీజ్

అబ్దుల్ అజీజ్ మరణం లష్కరే తోయిబా సంస్థకు భారీ దెబ్బగా భావిస్తున్నారు ఉగ్రవాద నాయకులు. భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక అతని ముద్ర కనిపిస్తోందని నిఘా సంస్థలు చెబుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో, పాకిస్తాన్ నుంచి డబ్బు,ఆయుధాలను సరఫరా చేయడంలో అతను కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే, 2006లో ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్లకు ఆర్థిక మద్దతు అందించినట్టు అనుమానిస్తున్నారు. 2008 ముంబై దాడుల్లో సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు, ఉపగ్రహ ఫోన్లు వంటి కీలక సామగ్రిని భారత్‌లోకి చొరబాటు చేయడంలో అజీజ్ పాత్ర వున్నట్లు నిఘా సమాచారం సూచిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు