LOADING...
Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా
భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా

Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేసే కుట్రలకు మలేషియా గట్టి సమాధానమిచ్చింది. మలేషియాలో భారత ప్రతినిధి బృందం నిర్వహించబోయే కార్యక్రమాలను నిలిపివేయాలని పాకిస్థాన్ చేసిన అభ్యర్థనను ఆ దేశ ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. సంజయ్ ఝా నేతృత్వంలోని భారత బృందం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో మలేషియాలో పదిమంది భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. ఈకార్యక్రమాలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా ప్రయత్నించింది. మలేషియా అధికారులను సంప్రదించిన పాక్ ప్రతినిధులు,భారత్ నిర్వహించబోయే ఈ కార్యక్రమాలపై మతపరమైన కోణంలో ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో..."భారత్-పాకిస్థాన్ రెండు ముస్లిం దేశాలు కావడంతో, మలేషియా భారత్ బృందం మాటలను వినాల్సిన అవసరం లేదంటూ",భారత బృందం కార్యక్రమాలను రద్దు చేయాలని కోరారు.

వివరాలు 

ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన మలేషియా 

అయితే, పాకిస్థాన్ ఈ విజ్ఞప్తిని మలేషియా ప్రభుత్వం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశం ఇంకా పరిష్కారానికి రాలేదన్న పాకిస్థాన్ వాదనను కూడా మలేషియా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్, భారత్‌ను అంతర్జాతీయ వేదికలపై విమర్శించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక గట్టి ఎదురుదెబ్బగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.