Page Loader
Bangladesh: భారత్ వ్యతిరేక ఉగ్ర నాయకుడితో మహ్మద్ యూనస్ భేటీ.. ఆన్‌లైన్‌లో వీడియోలు 
భారత్ వ్యతిరేక ఉగ్ర నాయకుడితో మహ్మద్ యూనస్ భేటీ.. ఆన్‌లైన్‌లో వీడియోలు

Bangladesh: భారత్ వ్యతిరేక ఉగ్ర నాయకుడితో మహ్మద్ యూనస్ భేటీ.. ఆన్‌లైన్‌లో వీడియోలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం సారథి మహమ్మద్ యూనస్ ఇటీవల అతివాద సంస్థ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు మమునుల్ హక్‌తో,అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. మమునుల్ హక్ అనేక రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ,భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి నేతతో యూనస్ సమావేశం కావడం,ఎన్నికల అంశాలపై చర్చించడం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ సమావేశం ఇటీవల బంగ్లా రాజధాని ఢాకాలో జరిగింది.మమునుల్ హక్ పై హింసను ప్రేరేపిస్తున్నారన్నఆరోపణలతో పలు అభియోగాలు క్రింద మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం అతనిని జైలుకు పంపించింది. అయితే,రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా హసీనా ఇటీవల పదవీ విరమణ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతోంది.

వివరాలు 

జమాతే ఇస్లామీపై షేక్ హసీనా నిషేధం 

తాత్కాలిక ప్రభుత్వం హక్‌తో సహా పలువురు అతివాద నేతలను విడుదల చేసింది.ఇప్పుడు యూనస్ వారితో ఎన్నికల సంస్కరణలు,సకాలంలో ఎన్నికలు నిర్వహణ వంటి అంశాలను చర్చించాడు. ఇదిలా ఉండగా,బంగ్లాదేశ్‌లో భారత్‌ వ్యతిరేకంగా పేరొందిన మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీపై షేక్ హసీనా విధించిన నిషేధం కూడా ప్రస్తుతం ఎత్తివేసింది. జమాతే ఇస్లామీ మతతత్వ పార్టీగా గుర్తించబడుతుంది.హసీనా ప్రభుత్వం రాజకీయ కారణాల వల్ల నిషేధం విధించిందని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంది.

వివరాలు 

భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు

మరోవైపు, జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రహమాన్ ఇటీవల భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలపై వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని, అయితే ద్వైపాక్షిక సంబంధాల పేరుతో ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని తెలిపారు. అలాగే, అమెరికా, చైనా, పాకిస్థాన్‌లతో బంగ్లా సన్నిహిత సంబంధాలను పెంపొందించాలని కూడా రహమాన్ సూచించారు.