
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు..ఇదంతా ఆదేశంలో పుట్టిందే.. పాకిస్థాన్ రక్షణ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం స్పష్టం చేశారు.
దీనికి విరుద్ధంగా, భారతదేశం పాకిస్తాన్‌లో అస్థిరతకు కారణమవుతోందని ఆయన ఆరోపించారు.
అధికార PML-N పార్టీకి చెందిన సీనియర్ నేతగా, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడిగా పేరున్న ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న హింస వెనుక అక్కడి స్వదేశీ శక్తులే కారణమని, ఇది స్థానిక విప్లవమేనని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇది పూర్తిగా ఆ దేశపు అంతర్గత వ్యవహారం: ఖ్వాజా ఆసిఫ్
మంగళవారం పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా,మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు భారత్ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
అయినప్పటికీ,పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులే దాడి వెనుక ఉన్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో,ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించి తమకు ఈ దాడితో సంబంధం లేదని అన్నారు.
లైవ్ 92న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,"ఈ దాడిలో పాకిస్తాన్‌కు ఎలాంటి పాత్ర లేదు.ఇది పూర్తిగా ఆ దేశపు అంతర్గత వ్యవహారం.భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు,విప్లవాలు కొనసాగుతున్నాయి.నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకూ,దక్షిణ భారతంలోని ఛత్తీస్‌గఢ్,మణిపూర్ వంటి రాష్ట్రాలలోనూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు."అని పేర్కొన్నారు.
వివరాలు
మైనారిటీలను అణచివేస్తున్నాయి.. క్రైస్తవులు, బౌద్ధులను దోపిడీ చేస్తున్నాయి
"ప్రజలు తమ హక్కులను కోరుతున్నారు. స్థానిక సంస్కృతిని, హిందూత్వ శక్తులు నాశనం చేస్తున్నాయి. మైనారిటీలను అణచివేస్తున్నారు. క్రైస్తవులు, బౌద్ధులు తదితర మతాలకు చెందిన వారిని హింసిస్తున్నారు. వారిని హత్యలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ప్రతిస్పందనగా ప్రజల్లో విప్లవ భావజాలాన్ని రగిలించింది. అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే దీనిలో పాకిస్తాన్‌కి ఏమాత్రం సంబంధం లేదు. మేము ఎప్పటికీ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వం." అంటూ తాము నిర్దోషులమన్న కథనాన్ని ఆసిఫ్ పునరుద్ఘాటించారు.