
Pakistan:భారత్ పై దాడికి సిద్దమవుతోన్న పాకిస్థాన్..ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని విశ్వసనీయ సమాచారం.
ఇందుకు అనుగుణంగా, పాకిస్థాన్ సైన్యాధిపతి తమ సైనిక బలగాలకు తగిన అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఫరీష్ త్వరలోనే తమ దేశ ప్రజలను ఉద్దేశించి మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడే అవకాశాలపై ఊహాగానాలు ముమ్మరంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు, యుద్ధ పరిస్థితి ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై భారత ప్రభుత్వం ముందస్తుగా చురుకైన చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించి, అవసరమైన ఆదేశాలను జారీ చేసింది.
వివరాలు
దేశవ్యాప్తంగా నేడు మాక్ డ్రిల్
హోంమంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచూ ఉన్నతాధికారులతో సమావేశమవుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కేంద్రం మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం.
అంతేకాదు, దేశవ్యాప్తంగా నేడు మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా అత్యవసర పరిస్థితులకు స్పందించే విధానాలను పరిశీలిస్తున్నారు.