Page Loader
Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ
అమెరికా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులు

Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ

వ్రాసిన వారు Stalin
Apr 29, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక వారం క్రితం కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University)లో పాలస్తీనా (Palestina)మద్దతుగా నిరసనలు (Protests) ప్రారంభమయ్యాయి. ఇక అప్పట్నుంచి అమెరికా (America) విశ్వవిద్యాలయాలలో, దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. న్యూయార్క్(New York)లోని కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఈ నిరసనల్లో దాదాపు 275 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనలను ఆ తర్వాత వేగంగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకూ, వివిధ ప్రాంతాలకు వ్యాపించాయి. హమాస్ (Hamas) కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ (Israel) చేసిన దాడులతో పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిని అణచి వేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్టులు చేశారు.

Pro Palestina protests-America

ఆందోళనలపై దృష్టి సారించి అధ్యక్షుడు జో బైడెన్

బోస్టన్‌లోని ఈశాన్య విశ్వవిద్యాలయంలో 100, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో 80, అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో 72, ఇండియానా విశ్వవిద్యాలయంలో 23 మంది ఉన్నారు. దేశవ్యాప్త నిరసనలపై అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి సారించారు. దీంతో నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా మాత్రమే ఉండాలని వైట్ హౌస్ పేర్కొంది.