
Tata Motors: టాటా మోటార్స్ షేర్లు 6శాతం పతనం.. ట్రంప్ నిర్ణయంతో పెట్టుబడిదారుల ఆందోళనలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం ట్రేడింగ్ సెషన్‌లో ఏకంగా 6 శాతం మేర క్షీణించాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్ల దిగుమతులపై సుంకాలు విధించడమే దీనికి ప్రధాన కారణంగా మారింది.
అమెరికా దిగుమతులపై 25శాతం సుంకం
అమెరికాలోకి విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకునే కంపెనీలపై 25 శాతం సుంకం (Tariffs) విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
వచ్చేవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. ఈ చర్య శాశ్వతంగా కొనసాగుతుందని, అయితే అమెరికాలో తయారయ్యే కార్లపై ఎలాంటి సుంకం ఉండదని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం యూఎస్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
Details
JLRపై తీవ్ర ప్రభావం
టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)కు అమెరికా అత్యంత కీలకమైన మార్కెట్.
JLR 2024 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం అమ్మకాల్లో 25 శాతం అమెరికా మార్కెట్ నుంచే వచ్చింది.
తాజా సుంకాల నిర్ణయం కంపెనీ లాభాలు, మార్జిన్‌లపై తీవ్ర ప్రభావం చూపనుందని పెట్టుబడిదారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
Details
షేర్ మార్కెట్‌లో ప్రభావం
ట్రంప్ నిర్ణయంతో ఆటోమొబైల్ షేర్లు భారీగా ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 6.31 శాతం పడిపోయి రూ.663 కనిష్ఠాన్ని తాకాయి.
ఉదయం 10:05 గంటల సమయంలో ఈ షేర్లు 5.49 శాతం నష్టంతో రూ.669 వద్ద ట్రేడవుతున్నాయి.
ఈ పరిణామం టాటా మోటార్స్ భవిష్యత్ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.