
US: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులనే చంపేసిన యువకుడు.. ఎవరు ఈ నికిటా క్యాసప్..?
ఈ వార్తాకథనం ఏంటి
తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు సాగించిన అధికారులు తెలిసిన వివరాలు చూసి షాక్‌కు గురయ్యారు.
డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలనే కుట్రలో భాగంగా ఆ యువకుడు తన తల్లిదండ్రులను చంపాడని విచారణలో స్పష్టమైంది.
ఈ విషయాన్ని అధికారికంగా ఫెడరల్ వారెంట్‌లో నమోదు చేశారు.
విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన నికిటా క్యాసప్ అనే 17 ఏళ్ల కుర్రాడు, 2024 ఫిబ్రవరి 11వ తేదీన తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్ మేయర్‌లను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు.
వివరాలు
కాన్సస్ ప్రాంతంలో నికిటా అరెస్టు
మరీ విచిత్రంగా, హత్య చేసిన అనంతరం అతడు కొన్ని వారాలపాటు ఆ మృతదేహాల పక్కననే నివసించినట్లు అధికారులు వెల్లడించారు.
అనంతరం అతడు $14,000 నగదు, పాస్‌పోర్ట్, ఇతర వస్తువులను తీసుకొని ఇంటి నుంచి పారిపోయాడు.
అతడి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు ఆ ఇంటిని పరిశీలించగా, ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి.
వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు, గత నెలలో కాన్సస్ ప్రాంతంలో నికిటాను అరెస్టు చేశారు.
విచారణలో అతడి ఆర్థిక పరిస్థితి, స్వేచ్ఛ పట్ల అతడి కోరికలే ఈ హత్యలకు కారణమని వెల్లడైంది.
అంతేకాకుండా, డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలనే కుట్రలో కూడా అతడు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.
వివరాలు
ఉక్రెయిన్‌కు పారిపోవాలని ప్రణాళిక
ఈ కుట్ర విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవడంతోనే నికిటా వారికి ప్రాణాలు తీశాడని అనుమానిస్తున్నారు.
వారిని హత్య చేసిన తర్వాత అతడు డ్రోన్‌లు,పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఒక రష్యన్ వ్యక్తితో కలిసి ట్రంప్‌పై దాడి కోసం ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది.
టిక్ టాక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇతడు సంబంధిత సంభాషణలు జరిపినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
ట్రంప్‌ను హత్య చేసి ఉక్రెయిన్‌కు పారిపోవాలన్నది అతడి ప్రణాళికగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఫెడరల్ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.