LOADING...
Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్
ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్

Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2024
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షల ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అంగీకరించారు. రెండు రోజులుగా జరుగుతున్న డెమోక్రాట్ల నేషనల్ కాన్వెన్షన్ చివరి రోజున అభ్యర్థిత్వ ప్రతిపాదనను వేలాదిమంది హర్షధ్వానుల మధ్య ఆమె అంగీకరిస్తూ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక అమెరికా ఏ మాత్రం ట్రంప్ చేతుల్లోకి వెళ్లదని ఆమె పేర్కొన్నారు. పని ప్రారంభిద్దామంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Details

ట్రంప్ తన స్వార్థ్యం కోసమే రాజకీయాలు చేస్తారు

దేశంలో ద్వేషం, విభజన పోరాటాలను అధిగమించడానికి మంచి అవకాశం లభించిందని, ఒక కొత్త మార్గంలో అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటానని కమలా హారిస్ హామీ ఇచ్చారు. ఇక తన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు ప్రస్తుతం జో బైడన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడిగా ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన స్వార్థ్యం కోసం రాజకీయాలు చేస్తారని, ఆయనకు విశ్వసనీయత ఉండదని కామెంట్స్ చేశారు.