
భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజాస్వామ్యంపై వస్తున్న ఆందోళనలను అమెరికా తోసిపుచ్చింది. భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, అనుమానం ఉంటే ఎవరైనా అక్కడికి వెళ్లి చూడొచ్చని వైట్ హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల కోఆర్డినేటర్ జాన్ కిర్బీ స్పష్టం చేశారు.
అమెరికాకు భారత్ అనేక స్థాయిల్లో బలమైన భాగస్వామి అని కిర్బీ చెప్పారు.
అమెరికా
రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక వాణిజ్యం
భారత్‌లో ప్రజాస్వామ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనకు సంబంధించిన విషయం ఇరు దేశాల మధ్య చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు జాన్ కిర్బీ చెప్పారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశంతోనైనా తమ ఆందోళనలను వ్యక్తపర్చడానికి ఎప్పుడూ వెనకాడబోడబోమని ఆయన చెప్పారు.
పరస్పరం మాట్లాడుకోవడం భాగస్వామ్యం, స్నేహం మరింత ముందుకు సాగుతుందని చెప్పారు.
రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక వాణిజ్యం ఉందని, భారతదేశం పసిఫిక్ క్వాడ్‌లో సభ్యదేశమని, ఇండో-పసిఫిక్ భద్రతకు సంబంధించి కీలక భాగస్వామి అని ఆయన అన్నారు.