Donald trump: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేగం పొందింది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ ,కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికల్లో ఓడితే మళ్లీ పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం విజయం సాధిస్తానన్న నమ్మకం ఆయనకు ఉంది. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా సేవలు అందించారు.
దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్ కీలక పాత్ర
"ఈసారి మేం ఓడిపోతామనే ఆలోచన లేదు. తప్పక విజయం సాధిస్తాం. ఒకవేళ మేము ఓడితే, 2028 ఎన్నికల్లో పోటీలో పాల్గొనను. ఇప్పటికీ నేను విజయం సాధిస్తే, దానికి ముగ్గురు కీలక పాత్ర పోషిస్తారు: కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్,తుల్సి గబ్బార్డ్. ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నడీ పని చేస్తారు. దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తారు. తుల్సికి పరిపాలనలో అనుభవం ఉంది. మేము వచ్చిన 12నెలల్లోనే ఇంధనం ధరలను 50 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం.ఈ నిర్ణయం కేవలం కార్లకే కాదు, ఇతర వ్యాపారాలకు కూడా సహాయపడుతుంది"అని ట్రంప్ అన్నారు. "ఆ ప్రపోజల్‌ను ట్రంప్ అంగీకరించాలి" అని కమలా హారిస్ పేర్కొన్నారు.
5పాయింట్ల ఆధిక్యంలో కమలాహారిస్
డెమోక్రటిక్ అభ్యర్థి,అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాతో జరిగిన ఇటీవల జరిగిన డిబేట్‌లో ట్రంప్ తడబాటుకు గురయ్యారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో,ట్రంప్ మరలా కమలాతో ఓపెన్ డిబేట్ చేయబోనని ప్రకటించారు.అక్టోబర్ 23న సీఎన్‌ఎన్‌లో జరగబోయే డిబేట్‌కు తాను సిద్ధంగా ఉన్నాను అని ట్రంప్ కూడా అంగీకరించాలని కమలాహారిస్ చెప్పారు. "ట్రంప్ డిబేట్‌కు వచ్చేందుకు అంగీకరించాలి.అమెరికా ప్రజల కోసం ఆయన పాల్గొనాలి.ఎన్నికల ముందు ఓటర్లతో మాట్లాడాలి.మరోసారి చర్చించేందుకు నేను ఎదురుచూస్తున్నా.కానీ,ప్రత్యర్థి తప్పించుకొనేందుకు కారణాలు వెతకడం కొనసాగిస్తున్నారు" అని న్యూయార్క్ సిటీలో ఓ ఫండ్‌రైజర్ కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్‌బీసీ న్యూస్ విడుదల చేసిన పోల్‌లో,కమలాహారిస్ 5పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమెకు 48శాతం,ట్రంప్‌కు 40శాతం మద్దతు ఉంది.మూడు పాయింట్లు ఎర్రర్ మార్జిన్‌లో ఉన్నాయి.