
India-Pak War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా పాత్ర.. దీటుగా జవాబిచ్చిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల విషయంలో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ తన సాంప్రదాయ ధోరణిని ప్రదర్శించింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ, అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా రాయబారి డోరతీ షియా వ్యాఖ్యానించారు. గత మూడు నెలల కాలంలో ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా నిర్దిష్టమైన పాత్ర నిర్వహించిందని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
ఇరుదేశాల మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమే ఉద్రిక్తతలు తగ్గడం
"ప్రపంచవ్యాప్తంగా వివిధ వివాదాలపై మధ్యవర్తిత్వం చేయడం, శాంతియుత పరిష్కారాలను సాధించేందుకు ప్రయత్నించడం అమెరికా పాలకుల ప్రధాన నిబద్ధత. తాజాగా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సద్దుమణిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రభుత్వ చర్యలు కీలకంగా నిలిచాయి" అని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ కౌంటర్ గా స్పందిస్తూ.. "భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం అనేది కేవలం ఇరుదేశాల మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమే.ఈప్రక్రియలో మూడవ పక్షంగా ఏ దేశమూ ప్రమేయం లేకుండా,పాకిస్థాన్ అభ్యర్థనపై భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది"అని తెలిపారు.అంతేగాక, ఈ విషయాన్ని అమెరికాకు ఇప్పటికే స్పష్టంగా తెలియజేశామని కూడా గుర్తు చేశారు.