
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. టోక్యో ప్రభుత్వం తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, జపాన్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 15 శాతం సుంకం విధించనుందని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో ఈ ఒప్పందాన్ని జపాన్ అంగీకరించకపోతే, ఆగస్టు 1వ తేదీ నుంచి 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించిన విషయాన్ని కూడా ట్రంప్ గుర్తు చేశారు.
వివరాలు
జపాన్ దేశం అమెరికాలో సుమారు 550 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి
జపాన్‌తో అమెరికా కుదుర్చుకున్న ఈ వాణిజ్య ఒప్పందం పరస్పరంగా 15 శాతం సుంకపు రేటును అమలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం కింద, తాను ఇచ్చిన ఆదేశాల ప్రకారం జపాన్ దేశం అమెరికాలో సుమారు 550 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనుందని పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల వల్ల జపాన్‌కు సుమారు 90 శాతం లాభాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ఎంతో విస్తృతంగా ఉండే అవకాశం ఉందని, అమెరికాతో ఇప్పటివరకు జపాన్ చేసిన ఒప్పందాల్లో ఇదే అతిపెద్దదిగా ఉండొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో చేసిన ట్వీట్
Donald J. Trump Truth Social :
— Markets Today (@marketsday) July 23, 2025
We just completed a massive Deal with Japan, perhaps the largest Deal ever made. Japan will invest, at my direction, $550 Billion Dollars into the United States, which will receive 90% of the Profits. This Deal will create Hundreds of Thousands of… pic.twitter.com/GBIUPiey6z
వివరాలు
అమెరికాకు జపాన్ 15 శాతం పరస్పర సుంకాలు
అయితే, ఈ భారీ పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. అయినా ఈ ఒప్పందం ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉత్పన్నమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్లు,ట్రక్కులు,బియ్యం,అలాగే ఇతర వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి ఈ ఒప్పందం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇకపై అమెరికాకు జపాన్ 15 శాతం పరస్పర సుంకాలను చెల్లించనుందని ఆయన వెల్లడించారు. గతంలోనే ట్రంప్,ఆగస్టు 1వ తేదీకి ముందే అనేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటామని ప్రకటించగా,ఇప్పుడు ఆయనే ఆ ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఇటీవలే ఆయన ఫిలిప్పీన్స్,ఇండోనేషియా,బ్రిటన్, వియత్నాం దేశాలతో వాణిజ్య ఒప్పందాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు జపాన్‌తోనూ ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.