Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. పన్నూన్ పిటిషన్‌పై విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన పిటిషన్‌పై అక్కడి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, మాజీ రా (RAW) చీఫ్ సామంత్ గోయెల్‌కు సంబంధించిన సమన్లను దౌత్య మార్గాల ద్వారా భారత ప్రభుత్వానికి పంపించింది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఈ సమన్లను అందజేసింది. తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ పన్నూన్ ఈ సివిల్ కేసు దాఖలు చేశాడు. తన హత్యకు రా సంస్థతో కలిసి అజిత్ దోవల్ కుట్ర పన్నారని పిటిషన్‌లో ఆరోపించాడు.
వివరాలు
గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత ప్రభుత్వం
ఈ కేసులో దోవల్, గోయెల్‌తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా పేర్కొన్నాడు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోర్టును కోరాడు.
గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.
అతడికి చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ)సంస్థను చట్టవిరుద్ధమైన సంస్థగా గుర్తించింది.
ఈ సంస్థ, దాని సభ్యులు ఖలిస్థాన్ ఉద్యమంతో సంబంధాలు కలిగి ఉన్నారు. అమెరికా, కెనడాలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
భారత దౌత్యవేత్తలపై హింసకు పాల్పడాలని పిలుపునివ్వడంతో పాటు భారత్‌లో దాడులు చేస్తామని బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భారత్ నుంచి విడిపోయి సిక్కుల కోసం ప్రత్యేక దేశంగా ఖలిస్థాన్ ఏర్పాటు చేయాలన్నది ఈ ఉద్యమం లక్ష్యం.
పంజాబ్‌లో దశాబ్దాల పాటు సాగిన హింసాత్మక తిరుగుబాటుకు ఈ ఉద్యమం కారణమైంది.
వివరాలు
హత్య కుట్ర కేసు నేపథ్యంలో పన్నూన్ పిటిషన్
1990వ దశకంలో ఆ ఉద్యమం క్రమంగా బలహీనపడింది. ఆ తర్వాత దాని నాయకులు, వివిధ సంస్థలు విదేశాల్లో ఆశ్రయం పొందాయి.
ముఖ్యంగా కెనడా కేంద్రంగా తమ వేర్పాటువాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
పన్నూన్ దాఖలు చేసిన సివిల్ కేసుకు సంబంధించి అమెరికా న్యాయ శాఖ గతంలో చేపట్టిన హత్య కుట్ర కేసు దర్యాప్తు కీలకంగా మారింది.
ఈ కేసులో భారతీయుడైన నిఖిల్ గుప్తా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలు కూడా అతడిపై ఉన్నాయి.
2023లో చెక్ రిపబ్లిక్‌లో అతడిని అరెస్టు చేసి అమెరికాకు అప్పగించారు. పన్నూన్‌ను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చే కుట్రలో నిఖిల్ గుప్తా పాల్గొన్నాడని అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది.
వివరాలు
హత్య కుట్ర కేసు నేపథ్యంలో పన్నూన్ పిటిషన్
ఈ వ్యవహారంలో భారత విదేశీ నిఘా సంస్థ రా(RAW)తో సంబంధం ఉన్న వికాస్ యాదవ్‌తో పాటు మరికొందరు కూడా భాగస్వాములుగా ఉన్నారని పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో నిఖిల్ గుప్తా తనపై నమోదైన అన్ని ఆరోపణలను అంగీకరిస్తూ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ నెల చివర్లో అతడికి శిక్ష ఖరారు చేయనున్నారు.
ఈ హత్య కుట్ర కేసులో అమెరికా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
మరోవైపు,వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత్‌లోని కోర్టులో కేసు ఎదుర్కొంటున్నాడు.
అయితే,పన్నూన్ దాఖలు చేసిన సివిల్ పిటిషన్‌ను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.ఈ పిటిషన్‌కు సరైన ఆధారాలు లేవని,ఇది అనవసరమైన చర్య అని పేర్కొంది.