
India-USA: సుంకాల విషయంలో భారత్‌పై మా వైఖరి చైనా, కెనడాలా ఉండదు: అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాల విధింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, తాజాగా యునైటెడ్ స్టేట్స్ (USA) భారత్‌ను చైనా, కెనడా, మెక్సికో దేశాలతో పోల్చమని తెలిపింది.
భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి.
యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధులు, న్యూఢిల్లీలో భారత అధికారులతో చర్చించగా, ఈ అంశంపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వివిధ మీడియా నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
వివరాలు
సుంకాలను 30శాతానికి తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచన
ఇదిలా ఉండగా,భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో,అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సుంకాలను తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచించారు.
లేదంటే,ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు తగ్గించే విషయాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 55శాతంగా ఉన్న ఈ సుంకాలను 30శాతానికి తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ తగ్గింపుతో సుమారు 23బిలియన్ డాలర్లు,అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2లక్షల కోట్లు భారం తగ్గవచ్చని అంచనా.
అయితే, ఈ నిర్ణయం ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.