
Venezuela: వెనెజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్.. ఎందుకంటే
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్ పడింది. 10 రోజుల పాటు ఎక్స్ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిసింది.
ఈ మేరకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో వెల్లడించారు.
ఎన్నికల అనంతరం హింస చేలరేగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇక సోషల్ మీడియా కారణంగా దేశంలో అశాంతి, అంతర్యుద్ధం చెలరేగుతోందని మడురో ఆరోపించారు.
Details
మడురో వ్యాఖ్యలను ఖండించిన వాట్సాప్
మరోవైపు టెలిగ్రామ్ అనుకూలంగా ఉండే మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ను సైతం వాడొద్దని మడురో తన మద్దతుదారులను కోరినట్లు తెలిసింది.
దీనివల్ల సైనికులు, పోలీసులు సమాచారం తెలుసుకొని వారి కుటుంబాలను బెదిరించే అవకాశం ఉందని ఆయన తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
అయితే ఈ వ్యాఖ్యలను వాట్సాప్ యాజమాన్యం ఖండించింది.
ఇటీవల జరిగిన వెనిజువెలా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ మడురో ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెట్‌కు ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే తుది ఫలితాల్లో మడురోకు విజయం దక్కింది.