
Gold Price Today; పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్.. బంగారం ధర ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల కిందటి వరకు బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా గణనీయమైన డిమాండ్‌ను కనబరిచింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు వంటి అనేక రాజకీయ, భౌగోళిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు.
ఈ పరిస్థితులు బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.
అయితే కొద్దికాలం తర్వాత ఈ ఉద్రిక్తతలు కొంత తగ్గాయి.అమెరికా-చైనా మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో పాటు,వాణిజ్య సుంకాల (టారిఫ్) అమలును వాయిదా వేయడం,భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలలో కొంత మార్పు రావడంతో మార్కెట్లలో భయాలు తగ్గాయి.
వివరాలు
రెండు రోజులుగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి
ఈ పరిణామాల ఫలితంగా ఇటీవల వారం పది రోజుల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.
ఇప్పటివరకూ ఉన్న గరిష్ట స్థాయితో పోలిస్తే దాదాపు రూ. 7 వేలకుపైనే తగ్గిందని చెప్పొచ్చు.
కానీ ఈ ధర తగ్గుదల ఎక్కువ రోజులు నిలవలేదు. ఇటీవల మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్న దిశగా కనిపిస్తున్నాయి.
అమెరికా డాలర్ విలువ క్రమంగా తగ్గిపోవడం,రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మళ్లీ ముదురటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాలు తిరిగి వెలువడటం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.
దీని ప్రభావంతో గత రెండు రోజులుగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సు (ounce)కు 3340 డాలర్లకు చేరుకుని ట్రేడవుతోంది.
వివరాలు
వెండి ధర ఔన్సుకు 33.57డాలర్లు
కిందటి రోజుతో పోలిస్తే ఇది 3300 డాలర్ల దిగువన ఉండగా,వారం క్రితం ఒక దశలో 3200డాలర్లకంటే తక్కువ స్థాయికి కూడా తగ్గింది.
వెండి ధర కూడా పెరిగి ప్రస్తుతం ఔన్సుకు 33.57డాలర్ల వద్ద ఉంది.
ఇదే సమయంలో రూపాయి మారకం విలువ కూడా క్షీణించటం కొనసాగుతోంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 85.59 వద్ద ట్రేడవుతోంది.
దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే,22క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజులోనే ఏకంగా రూ. 2400 పెరిగి 10 గ్రాములకు రూ. 97,420 కి చేరుకుంది.
గత రోజు ఇది రూ. 490 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 2200 పెరిగి ప్రస్తుతం రూ. 89,300 వద్ద ఉంది.
వివరాలు
ప్రస్తుతం రూ. 1.11 లక్షలు
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి ధరలు కూడా అదే రీతిలో పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ. 3,000 పెరిగి ప్రస్తుతం రూ. 1.11 లక్షలకు చేరింది.
గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతానికీ ప్రత్యేకంగా మారుతుంటాయి. ఇందుకు స్థానిక పన్నులు, ఇతర ప్రాదేశిక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.