Page Loader
Social Media X: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. 'ఎక్స్' కు 115,000 మంది యూజర్లు గుడ్‌బై
అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. 'ఎక్స్' కు 115,000 మంది యూజర్లు గుడ్‌బై

Social Media X: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. 'ఎక్స్' కు 115,000 మంది యూజర్లు గుడ్‌బై

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్‌'ను వదిలినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. సుమారు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఎన్నికల మరుసటి రోజే వెబ్‌సైట్‌లో తమ ఖాతాలను డీయాక్టివేట్‌ చేశారని సమాచారం. ఇది కేవలం వెబ్‌సైట్‌ యూజర్లను మాత్రమే సూచిస్తుందని, మొబైల్ యాప్‌ ద్వారా డీయాక్టివేట్‌ చేసిన యూజర్ల డేటా అందుబాటులో లేదని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని సాధించడం తెలిసిందే.

వివరాలు 

డబ్బులు చెల్లించి వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందే విధానం

ట్రంప్ విజయంలో 'ఎక్స్‌' అధినేత ఎలాన్ మస్క్‌ ప్రభావం చూపారని విశ్లేషణలు వస్తున్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఈ సోషల్‌మీడియా వేదిక రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ నిర్ణయాలు తీసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. నిషేధిత ఖాతాల పునరుద్ధరణ, వెరిఫికేషన్ విధానంలో మార్పులు వంటి మస్క్‌ చర్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రతీ యూజర్‌కి డబ్బులు చెల్లించి వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందే విధానంతో ఈ వేదిక ప్రకటనల ఆదాయంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు.

వివరాలు 

మిలియన్ కొత్త సైన్‌అప్‌లు

ఈ వివాదాల నేపథ్యంతో ప్రముఖ పాత్రికేయులు చార్లీ వార్జెట్‌, న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన మారా గే,మాజీ సీఎన్‌ఎన్‌ యాంకర్ డాన్‌ లెమన్ ఈ వేదికను వదిలి 'బ్లూ స్కై'లో చేరారు. అలాగే బ్రిటన్‌ మీడియా సంస్థ 'ది గార్డియన్‌' కూడా 'ఎక్స్‌'లో పోస్టులు చేయబోమని ప్రకటించింది. ఈ వేదికపై జాత్యహంకారం,కుట్రల వంటి అసహజ అంశాలు కనిపిస్తున్నాయని,ఈ కారణంగా దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ వేదికతో ఉన్న ప్రతికూలతలను గమనించిన మరెన్నో సంస్థలు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నాయి. మరోవైపు, 'ఎక్స్‌'కి ప్రత్యామ్నాయంగా ఉన్న''బ్లూస్కై''వేదిక 90 రోజుల్లోనే తన యూజర్‌ బేస్‌ను రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం దీనిలో 15మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.వారంలోనే మిలియన్ కొత్త సైన్‌అప్‌లు రావడం ఈ వేదిక వృద్ధికి సాక్ష్యంగా నిలిచింది.